ఆపిల్ హల్వా

Durga
తయారీకి కావాలసిని :  ఆపిల్ తురుము : 3 కప్పులు గోధుమపిండి.: 3 కప్పులు జీడిపప్పు : 200 గ్రాములు  పంచదార : 300 గ్రాములు  పాలు : అర లీటర్ వెనీల్లా ఎస్సెన్స్ : కొద్దిగా  నెయ్యి : 1 కప్పు తయారీ చేయువిధానం: ముందుగా పాలని కాగపెట్టాలి. తరువాత ఆపిల్ తురుముని అందులో వేసి సన్నటి సెగమీద ఉడకపెట్టాలి. ఉడికేటప్పుడు గరిటతో కలుపుతుండాలి. మెత్తగా ఉడికిన తరువాత గోధుమపిండిని కొద్దికొద్దిగా కలుపుతూ బాగా కలియబెట్టాలి. పిండి బాగా ఉడికిన తరువాత పంచదారని పోసి బాగా కలపాలి. తరువాత కొద్దికొద్దిగా నెయ్యిని పోస్తూ కలియపెట్టాలి. ఆ మిశ్రమం గట్టిపడ్డ తరువాత జీడిపప్పుని, ఎసెన్స్ ను వేసి కలియబెట్టాలి. నెయ్యి రాసిన పళ్లెంలో ఈ మిశ్రమాన్ని పోసి ఆరబెట్టాలి.  పది నిమిషాలు తరువాత చాకుతో ముక్కలు కోసుకుంటే ఆపిల్ హల్వా తయారైనట్లే మీరిప్పుడే ప్రయత్నించండి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: