కరివేపాకు వల్ల ఆడవాళ్లకు ఎంత ఉపయోగమో తెలిస్తే దాన్ని తీసిపారేయరు... !!
భారతీయులు వంటల్లో ఎప్పటి నుంచో కరివేపాకును వాడుతున్నారు. కరివేపాకు వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. కూరల్లో, చారుల్లో కరివేపాకును ఎంత శ్రధ్ధగా వేస్తాము. కానీ దానిని తినేసమయంలో నిర్లక్షంగా తీసిపారేస్తాం. కానీ కరివేపాకు ఉపయోగాలు గురించి పూర్తిగా తెలుసుకుంటే మాత్రం దాన్ని తినకుండా ఉండలేము. అంతేకాకుండా మనకు పలు ఆరోగ్యకర ప్రయోజనాలను కూడా అందిస్తుంది.కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. కరివేపాకులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి . ఇందులో ఉండే బీటా కెరోటిన్, అమినో యాసిడ్స్, ప్రోటీన్స్ మొదలగునవి డెడ్ హెయిర్ ఫోలిసెల్స్ ను నివారించడంలో సహాయపడుతాయి.కరివేపాకు ప్రధానంగా కళ్ళకు చాలా మంచిది. ఇది ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అతివల అందంలో కూడా కీలక పాత్ర పోషించి మీ జుట్టు అందాన్ని రెట్టింపు చేయటంలోనూ సహాయపడుతుంది.
జుట్టు తెల్లబడకుండా చేయటంలో దీన్ని మించిన ఔషధం లేదు. కురులు నిగనిగలాడుతూ అందంగా కనిపించాలంటే సరైన పోషణ అవసరం.
మీ కురుల అందానికి కరివేపాకు ఎలావాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కరివేపాకును మెత్తగా రుబ్బుకుని ఆ పేస్ట్ లో మూడు స్పూన్ల మెంతిపొడి కలిపి జుట్టుకు ప్యాక్‌లా వేసుకుని, ఎండిన తర్వాత తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే 2 నెల్లల్లో తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
రోజూ నాలుగైదు పచ్చి కరివేపాకులుతిన్నా లేదా కనీసం కూరల్లోని ఆకు వదిలిపెట్టకుండాతిన్నా జుట్టు తెల్లబడదు.
కరివేపాకు, ఉసిరికాయ ముక్కలు, గుప్పెడు మందార పువ్వుల్ని తీసుకొని కొన్ని నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకొని ఆ పేస్ట్ ను తలకు బాగా పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు మృదువుగా తయారవుతుంది.కొబ్బరినూనెలో కొన్ని కరివేపాకు ఆకులను వేసి మరిగించి, చల్లారిన తర్వాత ఆ మిశ్రమాన్ని జుట్టుకుదుళ్లకు పట్టించి, మసాజ్‌చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేయడం వల్ల జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలు తగ్గుతాయి.
కొబ్బరినూనెలో ఉండే ప్రొటీన్లు జుట్టుకుదుళ్లకు బలాన్ని ఇస్తాయి. కరివేపాకు జుట్టు చిట్లిపోకుండా మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది.
గోరింటాకు, కరివేపాకు, మందార ఆకులు కలిపి నీరు పోసి పేస్ట్ లాగా చేసుకుని తలకు పట్టించి కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ జుట్టు మిల మిలా మెరుస్తుంది. అంతే కాకుండా బాగా పెరుగుతుంది.