ప్రెగ్నెన్సీ టైమ్‌లో కుంకుమ పువ్వును వాడే ముందు ఇవి తెలుసుకోండి..!!

Kavya Nekkanti

కుంకుమపువ్వు.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అయితే ఈ ప‌రిచ‌యం పేర్ల వ‌ర‌కే అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే.. ప్రపంచంలో అత్యంత కాస్ట్‌లీ సుగంధ ద్రవ్యం ఇది. అందుకే సామాన్యులు దీన్ని కొనుగోలు చేయ‌డానికి వెనుకాడ‌తారు. అయితే ప్రెగ్నెన్సీ మ‌హిళ‌ల‌కు మాత్రం ఖ‌ర్చు ఎక్కువ అయినా కొనుగోలు చేసి ఇస్తారు. ఎందుకూ అంటే.. గర్భధారణ సమయంలో కుంకుమపువ్వు తినడం వల్ల పుట్టే బిడ్డలు తెల్లగా ఉంటారన్నది ఆ నమ్మకం. కానీ, కుంకుమ పువ్వు కేవ‌లం బిడ్డ తెల్ల‌గా పుట్ట‌డానికి మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డుతుంది అని అనుకోవ‌డం త‌ప్పు.

 

అవును! దీని వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు. కుంకుమ పువ్వును పాల‌లో క‌లిపి తాగ‌డం వ‌ల్ల గ‌ర్భిణీ శ‌రీరంలోని ర‌క్తం శుద్ధి అవుతుంది. ఇక వాస్త‌వానికి కుంకుమపువ్వు తినడం వల్ల పుట్టే బిడ్డ తెల్లగా పుడుతుందని గ్యారెంటీ లేదు కానీ, ఇందులో ఇతర పోషక విలువలు, మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి కండరాల నొప్పులను మరియు మార్నింగ్ సిక్ నెస్ ను తగ్గిస్తుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.

 

అదేవిధంగా,  సుఖ ప్రసవానికి కూడా కుంకుమ పువ్వు ఎంతగానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇక ప్రెగ్నెన్సీ మ‌హిళ‌లు తరచూ మనస్సు మారుతుంటుంది. అందుకు కారణం వారిలో కలిగే హార్మోనుల అసమతుల్యతలే. అయితే కుంకుమపువ్వు శరీరాన్ని మైండ్ ను విశ్రాంతి ప‌ర‌చ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. కాబ‌ట్టి..  5 నెలల తర్వాత పాలు లేదా ఆహారంలో కేసర్ లేదా కుంకుమ పువ్వు వేసుకుంటే మంచిది. అయితే ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. గర్భిణి మహిళలు పెద్ద మొత్తంలో దీనిని వాడకూడదు.

  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: