ఆ రెండు రోజుల్లో ఆడ‌వారు త‌ల‌స్నానం చేస్తే ఎంత మంచిదో తెలుసా..?

Kavya Nekkanti

త‌ల‌స్నానం.. ప్ర‌తిఒక్క‌రికీ అవ‌స‌ర‌మే. త‌ల‌స్నానం చేయ‌డం ఎంత ముఖ్య‌మో.. ఏ రోజు చేయాలి అన్న‌ది కూడా అంతే ముఖ్యం అంటున్నారు. ముఖ్యంగా ఆడ‌వారు వారంలోని కొన్ని కొన్ని రోజుల్లో త‌ల‌స్నానం చేయ‌డం మంచి ఫ‌లితాలు పొంద‌వ‌చ్చంటున్నారు. వాస్త‌వానికి హిందూ సంప్రదాయం లో మాత్రం దీనికి చాలా పట్టింపులే ఉంటాయి. పండితులు సైతం అందరికి అలానే చెబుతూ ఉంటారు. వారి చెప్పిన దాని ప్రకారం ఈ రోజుల్లో ఆడ‌వారు త‌ల‌స్నానం చేస్తే చాలా మంచిది వేరే రోజుల్లో చేస్తే అరిష్టం అని చెప్తారు. 

 

మ‌రి ఆ రోజులు ఏంటి..? వాటి ఫ‌లితాలు ఏంటి..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. ఆడవారు బుధవారం త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల ఆ ఇంట్లో ఐశ్వర్యం తో పాటు, ఐదోతనం కూడా మెండుగా ఉంటాయట. మ‌రియు ఆడవారు ఈ దిన‌ము త‌ల‌స్నానం చేస్తే సుఖమైన జీవనం కొనసాగిస్తారని చెబుతున్నారు. అలాగే శనివారం కూడా ఆడ‌వారు తలస్నానం చేయ‌డం మంచిద‌ట‌. అలా చేయ‌డం వ‌ల్ల ఆయుర్వృద్ధి, వస్తు సేకరణ లాభం, కుటుంబ సౌఖ్యం కలుగుతుంద‌ట‌.

 

అయితే మంగళవారం మాత్రం ఒక్క ఆడవారే కాదు మగవారు కూడా చేయరాదట. మ‌రోవిష‌యం ఏంటంటే.. తలస్నానం చేసిన తర్వాత స్త్రీలు ఎన్నడు కూడా తమ యొక్క జుట్టుని విరబోసుకోకూడదు. ఎందుకంటే.. సమస్త భూత ప్రేతాది దుష్టశక్తులు వెంట్రుకల గుండా ప్రవేశిస్తాయట. అందుకే తలస్నానానంతరం చివర ముడి వేసుకోకుండా ఉండ‌కూడ‌దంటున్నారు.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: