కలర్‌ఫుల్‌ రైస్ ఎప్పుడైనా తిన్నారా?

Durga Writes

మనం లెమెన్ రైస్ తినింటం.. పులిహోర తినింటం... వైట్ రైస్ తినింటం.. కానీ ఎప్పుడైనా కలర్ ఫుల్ రైస్ తిన్నారా? కలర్ ఫుల్ రైస్ అంటే కలర్లు కలపడం కాదు.. అన్ని కలర్ ఫుల్.. ప్రోటీన్లు ఫుల్ ఉండే కూరగాయలతో చేసుకుని తినేదాన్ని కలర్‌ఫుల్‌ రైస్ అని అంటారు.. చూడటానికి అందంగా.. తినటానికి రుచిగా.. శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ కలర్‌ఫుల్‌ రైస్ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అలాంటి ఈ రైస్ ను ఎలా చేసుకొని తినాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావలసిన పదార్థాలు...

 

బ్రౌన్‌ బాసుమతి రైస్‌ - 1 కప్పు, 

 

నీరు - ఒకటిన్నర కప్పు, 

 

క్యారెట్‌, ఉల్లికాడ, 

 

గ్రీన్‌ క్యాప్సికం, 

 

రెడ్‌ క్యాప్సికం, 

 

కొత్తిమీర తరుగు - అరకప్పు చొప్పున, 

 

ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత, 

 

నువ్వుల నూనె - 1 టేబుల్‌ స్పూను.

 

తయారీ విధానం... 

 

బ్రౌన్ రైస్‌ను కడిగి, 30 నిమిషాలు నానబెట్టి, పొడిగా వండి ఆరబెట్టాలి. నూనెలో ఉల్లికాడలు, క్యారెట్‌, రెడ్‌ క్యాప్సికం, గ్రీన్‌ క్యాప్సికం, కొత్తిమీర తరుగు అన్ని రెండు నిమిషాల తేడాతో ఒకటి తర్వాత ఒకటి వేస్తూ వేగించాలి. ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడితో పాటు రైస్‌ వేసి 2 నిమిషాలు కలపాలి అంతే కలర్‌ఫుల్‌ రైస్ రెడీ. ఈ కలర్‌ఫుల్‌  రైస్ ను వేడివేడిగా తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: