పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఓ అధికారి భార్య పై రాక్షసంగా ప్రవర్తించాడే..

Satvika

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు.. ఈ సామెతను అందరు వినే ఉంటారు.. చేసేదొకటి చెప్పేది మరొకటి అయినా సందర్భాల్లో ఈ సామెతను వాడుతుంటారు. అయితే సరిగ్గా ఈ సామెతకు సరిపోయేలా చేశారు.. పేరుకేమో అతను ఒక బ్యాంక్ ఉద్యోగి చేసేది మాత్రం బుద్ది తక్కువ పని. భార్య ఉండగానే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కట్టుకున్న భార్యను అతి క్రూరంగా హత్య చేశాడు. 


అదనపు కట్నం కోసం భార్యను రాబందువు లాగ పీక్కు తిన్నాడు. అంతేకాకుండా ఆమె తన రహస్య శృంగారానికి అడ్డుగా ఉందని భావించిన అతను తెలియకుండా ఫుడ్ లో సైనేడ్ కలిపి మరి చంపేశాడు. వివరాలలోకి వెళితే.. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన రవిచైతన్య అనే వ్యక్తి బ్యాంకులో మేనేజర్ గా పనిచేస్తున్నాడు.అతనికి కొంతకాలానికి చెందిన ఆమని అనే యువతితో వివాహమైంది.పెళ్లి సమయంలో రూ.15లక్షలు, 150 తులాల బంగారం, ఎకరం పొలం కట్నంగా ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు.

 

ఇది ఇలా ఉండగా ఆమని సోదరి వివాహామైనది. ఆమెకు కట్నం కింద రెండు ఎకరాల పొలం ఇచ్చారని, రెండు అల్లుడు అంత తియ్యగా పెడతాడా అంటూ అయన భర్తను వేధించసాగాడు.. ఆ క్రమంలో అతనిలోని మృగం బయటకు వచ్చింది. దీంతో ఆమెపై తన అక్కసును వెల్లడించారు. తనకు అదనపు కట్నం కావాలంటూ భార్య, అత్తమామలను వేధించాడు.

 

అంతేకాకుండా అతనికి చాలా మందితో అక్రమ సంబంధం ఉండటంతో ఆమని అడ్డుగా ఉందని సాఫీగా అడ్డు తొలగించుకున్నాడు. ఆమె రోజూ వేసుకునే బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్లలో సైనేడ్ కలిపాడు.ఏమీ తెలియనట్లుగా బాత్రూమ్ లో జారి కిందపడిపోయిందని చెప్పి ఆస్పత్రికి తీసుకువెళ్లారు.అనుమానం వచ్చిన డాక్టర్లు పోస్ట్ మార్టం చేసి గుట్టు రట్టు చేసాడు. మృతురాలి బంధువులు పోలీసులకు పిర్యాదు చేయడంతో పోలీసులు భర్త, అత్తమామలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: