కింగ్స్మా దాల్ మస్కా

Durga
 కావలసిన పదార్థాలు: రాజ్మా - 100 గ్రాములు  వెన్న - 25 గ్రాములు  మినుములు - 100 గ్రాములు  అల్లం- కొద్దిగా  పసుపు - చిటికెడు గరం మసాల - 2టీ స్పూన్  టమాట పేస్ట్ - 4టీ స్పూన్  కొత్తిమిర - కొద్దిగా నూనె- 150 గ్రాములు ఉల్లిపాయలు -2 వెల్లుల్లి - 4 జీడిపప్పు- 4 ఉప్పు- రుచికి సరిపడా గసగసాలు - 2టేబుల్ స్పేూన్  తయారు చేయు విధానం:  మొదటగా రాజ్మా, మినుములు, నీటిలో మూడు గంటల పాటు నానా బెట్టి తర్వాత ఉప్పు వేసి ఉడకించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ వెలిగించి పాన్ పెట్టి అర కప్పు నూనె వేసి కాగాక దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు వేయాలి. దీనిలో తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి కారం, టమోటో పేస్ట్ వేసి బాగా కలియ బెట్టాలి. మొదట సిద్దం చేసి పెట్టుకొన్న మిశ్రమాన్ని కూడా పాన్ లో వేసి ఉడకనివ్వాలి. దీనికి జీడిపప్పు, గసగసాలు కలిపి పేస్ట్ చేసి ఇందులో వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. పైనల్ గా గరం మసాలా వేసి మరికొద్ది సేపు మగ్గనివ్వాలి. దీనిపై కొత్తిమిరి చల్లి, కొద్దిగా వెన్న కూడా వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: