పాలక్ పూరీలు

Durga
పాలక్ పూరీలు తయారీకి కావాలసినవి : గోధుమ పిండి : 50 గ్రాములు పాలకూర : 6 కట్టలు ఉప్పు : తగినంత జీలకర్ర : 5 గ్రాములు రిఫైన్డ్ ఆయుల్ : వేయించడానికి సరిపడ తయారీ చేయువిధానం : పాలకూరని వేడి నీటిలో ఉడికించి తరువాత చన్నీళ్లో వేసి చల్లారాక నీళ్లు పిండి మెత్తగా గుజ్జులా గ్రైండ్ చేయాలి. తరువాత గోధుమ పిండిని జల్లించి తగినంత ఉప్పు, పాలకూర గుజ్జు జీలకర్ర కలిపి నీళ్లు పోసి పూరి పిండిని కలుపుకోవాలి.  ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి పూరీలా వత్తి పెట్టుకొని బాండీలో నూనె వేసి మరిగాక వేయించుకోవాలి. ఆలు కుర్మా కానీ, కొబ్బరి చట్నీ కాని, కోడి కూర కాని నంజుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. పేనం మీద కూడ కాల్చుకుని తినవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: