కాలిఫ్లవర్‌ల తో ఆమ్లెట్

Durga
కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు: 5 కాలీఫ్లవర్: 1 పువ్వు ఉల్లిపాయ: ఒకటి పచ్చిమిర్చి: 4 శెనగపిండి: కొద్దిగా మిరియాలపొడి: 1/2 టేబుల్ స్పూన్ పసుపు: 1/4 టేబుల్ స్పూన్ నూనె: కావలసినంత ఉప్పు: కావలసినంత తయారు చేయు విధానము: ముందుగా కాలిఫ్లవర్‍ను చిన్న ముక్కలుగా చేసుకొని ఉప్పు నీటిలో వేసి శుభ్రంగా కడగాలి. కడిగినవాటిని కొద్దిగా వుడకపెట్టుకోవాలి.. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలనుకూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు శనగపిండి, మిరియాల పొడి, కొద్దిగా పసుపు, ఉప్పులను వేసి కొద్దిగా నీరు వేసి కలిపి అందులో కోడిగుడ్లను పగులగొట్టి వేసి బాగా కలపాలి. తరువాత ముందుగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలను కూడా ఇందులో వేసి కలపాలి.  ఇప్పడు బాణలి (పాన్)లో నూనె వేసి వేగాక.. అందులో పై మిశ్రమాన్ని చిన్న అట్టుల్లాగా వేసి ఎర్రగా వేయించి తీసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే తినడానికి కాలిఫ్లవర్‌ ఆమ్లెట్ రెడీ. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: