పుదీనా రైతా

Durga
పుదీనా రైతా పెరుగు నిత్యాహారంలో వాడటం చాలామంచిది. మసాలా వంటకాలు తిన్న తర్వాత పెరుగు లేదా రైతా తింటే చల్లగా ఉంటుంది. ఈ రైతా లేదా పెరుగు పచ్చడి ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. కొంచెం కొత్తగా, వెరయిటీగా పుదీనా రైతా ఎలా చేయాలో తెలుసుకుందాం. కావాలసిన వస్తువులు : పెరుగు : 1 కప్పు పుదీనా ఆకులు : 6-8 పచ్చిమిర్చి : 1 నల్ల  ఉప్పు : చిటికెడు జీలకర్ర పొడి : అర స్పూన్  కీరా తురుము : ¼ కప్పు  ఉప్పు :

తగినంత  తయారు చేయువిధానం:  పుదీనా ఆకులు , పచ్చిమిర్చి, నల్ల ఉప్పు కలిపి మెత్తగా నూరుకోవాలి. పెరుగులో ఈ ముద్ద వేసే కలపాలి. ఇందులో తగినంత ఉప్పు, ఇలకర్ర పొడి వేసి కలపాలి. కీరా దోసకాయ చెక్కు తీసి తురిమి పెరుగులో కలిపి చల్లగా సర్వ్ చేయాలి. ఈ రైతా పులావ్, బిర్యానీలకు బావుంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: