తూతక్ తయారీకి
కావాలసిన పధార్థాలు :
బొంబాయి రవ్వ : అర కేజీ
నెయ్యి : 75 గ్రా
ఉప్పు : చిటికెడు
వంటసోడా : చిటకెడు
మటన్ ఖీమా : 300 గ్రాములు
ఉల్లిపాయలు : రెండు
కారం : అర టీ స్పూన్
అల్లం, వెల్లుల్లి : అర టీ స్పూన్
నిమ్మరసం : ఒక టీ స్పూన్
కొత్తిమీర : ఒక కట్ట
నూనె : రెండు టీ స్పూన్లు
ధనియాలపొడి : ఒక చెంచా
గరంమసాలా : అర చెంచా
నూనె : తగినంత
తయారీ చేసే విధానం :
బొంబాయి రవ్వ లో నెయ్యిని కలియబెట్టి ఉప్ప, వంటసోడా వేసి కొన్ని నీళ్లు చల్లి ముద్దలా కలిపాలి. దీన్ని పన్నెండు ముద్దలుగా విడతీసి తడి వస్త్రంతో కప్పి ఉంచాలి, మటన్ కీమాను ఉడికించి పక్కన ఉంచాలి.
ఓ బాణలిలో కొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేయించి అల్లం వెల్లుల్లిముద్ద, కారం, ధనియాలపొడి. ఉప్పు కలిపి మటన్ కీమా కూడా కలిపి పొడిపొడిలాడేలా వేయించాలి.
దీనిని ఓ గిన్నెలోకి తీసి నిమ్మరసం, కొత్తిమీర చేర్చాలి. పిండిముద్దను పలచగా వత్తి కీమా కూరను దాని మధ్యలో ఉంచి అన్ని వైపులా మూసేసీ దగ్గరగా చేసి కోడిగుడ్డు ఆకారంలో చుట్టే కాస్త చేత్తో వత్తాలి.
ఓ బాణాలిలో నూనెవేసి సన్నని మంటమీద ఈ తూతక్ లను బంగారురంగులో వేయించి తీసి పుదీనాచట్నీతో వడ్డించాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: