పాలకూర పలావ్

Durga
పాలకూరలో ఆరోగ్యానికి మేలు చేసే ఔషధగుణాలు ఎన్నోవున్నాయి. పాలకూరను వారానికి రెండుసార్లు తీసుకుంటే ఒబిసిటీ నివారించవచ్చు. అలాంటి పాలకూరతో పలావ్.. మంచి రుచిని ఇస్తుంది. అదెలా తయారుచేలంటే... కావాలసిన పదార్థాలు: బాస్మతి రైస్ : 2 కప్పులు పాలకూర తరుగు : 1 కప్పు స్వీట్ కార్న్ : అరకప్పు తాలింపుకు : ఒక టీ స్పూన్- జీలకర్ర, అర టీస్పూన్- ఇంగువ, ఒక ఉల్లిపాయ, ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి. పసుపు:  చిటికెడు. ఉప్పు: తగినంత, అంచుర్ పొడి : ఒక టేబుల్ స్పూన్. తయారీ విధానం: మూకుడులో నూనె వేడిచేసి జీలకర్ర వేసి చిటపటలాడాక ఇంగువ, ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. పచ్చి మిరపకాయ ముక్కలు, పసుపు వేసి వేపాలి. పాలకూర తరుగు వేసి సెగ తగ్గించాలి. ఉప్పు, అంచుర్ పొడి, ఉడికించిన అన్నం, స్వీట్ కార్న్ వేసి బాగా కలియబెట్టి వేడి వేడిగా కడాయ్ చికెన్, కడాయ్ పనీర్‌తో సర్వ్ చేస్తే మాంచి రుచిగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: