మిక్ట్స్ దాల్ తడ్కా

Durga
తయారీలో వాడే పధార్థాలు :  పొట్టు పెసరపప్పు : 125 గ్రాములు, పచ్చిశనగపప్పు: 50 గ్రాములు. అల్లం : 15 గ్రాములు. వెల్లుల్లి : 10 రెబ్బలు. టొమోటాలు :1 . పచ్చిమిర్చి : 3. ఉల్లిపాయలు :3 . కారం :1/2 చెంచా . ఉప్పు : రుచికి సరిపడ. బటర్ : 25 గ్రాములు. కొత్తిమీర:14 కప్పు తరుగు. నూనె : ½ కప్పు. కసూరీ మేధి : 2 చెంచాలు.  తయారీ ఎలా ?  1) ముందుగా అన్ని రకాల పప్పులను ఒక గిన్నెలో పోసి నీరు పోసి 2గంటల పాటు నాన పెట్టాలి. 2) తరువాత శుభ్రంగా కడిగి సరిపడ నీరు పోసి వాటికి పసుపు జత చేసి కుక్కర్ పెట్టి ఉడికించాలి. 3) ఉల్లిపాయల తొక్కు తీసి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. టామోటోను కూడా సన్నగా ముక్కలు చేయాలి.  4) అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి.  5) బాండీ పెట్టి నూనె పోసి వేడి చేయాలి . 6) ఆ నూనెలో ముందుగా ఉల్లి ముక్కలు వేసి కలుపుతూ దోరగా వేపుకోవాలి. 7) తరువాత అల్లం, వెల్లుల్లి, మిర్చి ముక్కలు వేసి కలుపుతూ ఎర్రగా వేపుకోవాలి. 8) ఈ లోపట కుక్కర్ పెట్టి ఉడికించి పప్పులను తీసి మెదుపుతూ కలిపి వేసిన ఉల్లి ముక్కలు మిశ్రమంలో పోసి కొంచెం నీరు కలిపి ఉడికించాలి.  9) నీరు బుడగలు వస్తున్నప్పుడు కారం, సరిపడ ఉప్పు, సన్నగా కట్ చేసిన టొమోటో ముక్కలు వేసి 5 నిమిషాలపాటు ఉడికించాలి. 10) ఈ లోపల కసూరీమేధిని పొడిగా ఉన్న బాండీలో వేసి వేపాలి.  11) వాటిని చల్లారనిచ్చి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి.  12) ఈ పొడిని ఉడుకుతున్న పప్పులో వేయాలి. 13) తరువాత బటర్ వేసి కలపాలి.  14) ఈ మిక్ట్స్ దాల్ మీద కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: