విజయం మీదే: ఓటమి పాఠాలే విజయ రహస్యాలు !

VAMSI
ఇక్కడ భూమి మీద జీవించే ప్రతి మనిషి కూడా విజయం... విజయం.... అంటూ పరుగులు తీస్తూ ఉంటారు. కానీ... అసలు ఓటమి నేర్పిన పాఠాలను చక్కగా అర్దం చేసుకోగలిగితే అసలు విజయం ఎంతో సేపు మిమ్మల్ని ఊరించలేదు. కొందరు విజయం అందుకోవడానికి వంద సార్లు అయినా ప్రయత్నిస్తుంటారు.. కానీ 99 ఓటమిలు తెలియ చేసిన విజయ సూత్రాల గురించి అస్సలు పట్టించుకోరు. విజయం అందరికీ అంత ఈజీగా అందదు. కొందరికి విజయం సులువుగా అదృష్టం తో పాటు కలిసొచ్చి మొదటి ప్రయత్నం లోనే వరిస్తే మరి కొందరికి మాత్రం ఎన్ని సార్లు ప్రయత్నించినా అస్సలు దక్కదు .
అయితే అక్కడ వారు అన్ని సార్లు ఎందుకు ఓడిపోతున్నారు. వారు పదే పదే ఎందుకు ఓడిపోతున్నారు, అన్న విషయం గురించి ఒక్కసారి అలోచించి తమ పొరపాట్లను రిమోట్ కార్ లాగా సరి చేసుకోగలిగితే ...ఇక విజయం మిమ్మలిని తప్పక వరిస్తుంది. మీరు మళ్ళీ మళ్ళీ ఓడిపోతున్నారా అయితే ఆ విషయాలు తప్పక తెలుసుకోండి, బాగా గమనించండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఓటమి పాలయ్యారు అంటే అందుకు గల కారణాలను ముందుగా చూసుకోండి. వాటిని తిరిగి పునరావృతం చేయకుండా జాగ్రత్త పడండి. అలాగే ఎప్పటిలాగే ఒకే దారిలో వెళ్లకుండా కొత్త మార్గాన్ని అన్వేషించండి.
ఇలా మీ ఓటమి నుండి విజయ రహస్యాలను తెలుసుకోగలిగితే విజయ మిమ్మల్ని తప్పక వరిస్తుంది. ఇక్కడ అందరూ విజయం సాధించడసానికి అర్హులే అన్న విషయాన్ని గుర్తించుకోండి. ఇది ఏ కొందరికో అంకితం అయినది కాదు. మనము చేసే పనిలో నమ్మకం ఉండాలి, చేసే పనిలో నిజాయితీ ఉండాలి... అప్పుడు మీ నుండి విజయాన్ని ఎవ్వరూ దూరం చేయలేరు. పైన చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని అర్ధం చేసుకుని ఆచరణలో పెట్టగలిగితే విజయం మీకు సొంతం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: