విజయం మీదే: వచ్చిన ఛాన్స్ వదులుకుంటే... సక్సెస్ కాలేరు!

VAMSI
మన మన లక్ష్యాలను బట్టి మన గమ్యం నిర్దేశించబడుతుంది. కొన్ని సార్లు మన లక్ష్యం సరిగ్గా ఉన్నా వెళ్ళే మార్గం గజిబిజిగా మారొచ్చు. అలాంటప్పుడు మనం కోరుకున్న లక్ష్యానికి బదులుగా వేరొక చోటుకు చేరుకుంటాం, సమయం గడిచి పోతుంది చాలా దూరం ప్రయాణం కూడా సాగిపోతుంది. కానీ కోరుకున్న తీరం కానప్పుడు అనుకున్న లక్ష్యం కానపుడు అందులో సంతోషం ఉండదు. ఒకవేళ మరల కనుక కోరుకున్న లక్ష్యాన్ని మన జీవితాన్ని మలుపు తిప్పే చక్కటి అవకాశం కనుక మళ్ళీ వస్తే వదుకుకోకండి అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు మీ ప్రయాణం సాగించండి, తిరిగి ప్రయత్నాన్ని కొనసాగించండి. జీవితంలో ఏ వ్యక్తి అయినా కూడా నా స్థాయి ఇంత వరకే అని ఆగిపోకూడదు, లేనిపోని భయాలతో ప్రయాణాన్ని నిలిపి వేయకూడదు.
 
ఇక్కడ చెప్పాలి అనుకుంటున్న విషయం యొక్క అంతరార్థం అర్దం అయ్యేలా చెప్పాలంటే ....
ఒక వ్యక్తి యొక్క జీవిత లక్ష్యం తన జీవితాన్ని పెద్దగా ఆర్ధిక ఇబ్బందులు లేకుండా మంచిగా సెటిల్ అవ్వడం, అందుకోసం ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని కానీ, వ్యాపారాన్ని కానీ చేయడం. అయితే అతడి కలకు తన కుటుంబం , లేదా మరేవైన సమస్యలు ఎదురయ్యి వెంటనే దొరికిన ఉద్యోగాన్ని చేయడం లేదా ఏదో ఒక చిన్న పని చేసుకోవాల్సి రావడం వస్తే అక్కడ వేరే మార్గం లేక అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. అయితే కొంత కాలం అలా గడిచాక మరలా మీరుకున్న జీవితం పొందే విధంగా ఉద్యోగ అవకాశమో లేక వ్యాపార అవకాశమో వస్తే ఉన్న ఆధారాన్ని విడిచి కొత్తగా ప్రయోగం ఎందుకు అని ఆగిపోకండి.
ఎందుకంటే మనం మళ్ళీ ఆ ప్రయాణంలో విజయం సాధిస్తామా లేదా అన్నది మన అనుమానం మాత్రమే. కానీ వదులుకుంటే మాత్రం అది ఎన్నటికీ ఖచ్చితంగా దక్కదు అని మాత్రం తెలుసుకోండి. అందుకే అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగ పరచుకున్నా వాడే ఉన్నత స్థాయికి చేరుకోగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: