విజయం మీదే: పక్కవాడి లక్ష్యం మీకు చులకనా... ?

VAMSI
చాలా మంది ఏ జాబ్ చేయకుండా ఖాళీగా ఉంటారు. కానీ దానికి పలు రకాల కారణాలు ఉండొచ్చు.. అయితే దాదాపు అందరూ కూడా వీరిని గురించి మొదటగా అనే మాట వీరు ఎందుకు పనికి రారు, ఇటువంటి వారికి ఏ విజయం అందదు అని. ఈ మాట అనడం చాలా సులభం , ఆ మాటతో ఇతరులను బాధ పెట్టడం కూడా సులభమే. అయితే మాట అనే ముందు ఒక్క సారి కనుక ఆలోచిస్తే బహుశా మీ నోటి వెంట ఆ మాట బయటకు రాదేమో. ఏ పనిలో యంగేజ్ కాకుండా ఆర్దికంగా ఎదగని వ్యక్తి గౌరవానికి అనర్హుడని, పనికి రారు అనుకుంటే పొరపాటే. అందరికీ జీవితం ఒకే దారిని , ఒకే రకమైన జీవన ప్రయాణాన్ని ఇవ్వదు.
వాటిని మనమే నిర్మించుకోవాలి, అయితే ప్రతి ఒక్కరికీ ప్రతి సారి అవన్నీ కుదరక పోవచ్చు. అలాగని వారు ఎందుకు పనికి రానివారు అని అనకూడదు. అలాగే కొందరు తాము కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆశయంతో వచ్చిన అవకాశాలను వదులుకుని తాము అనుకున్న దాని కోసం ఎదురు చూస్తుంటారు. ఇలా ఎన్నో కారణాలు వారి మౌనం వెనక దాగి ఉండొచ్చు అవన్నీ తెలుసుకోకుండా టక్కున ఒక మాట అనకూడదు.  ప్రతి మనిషిలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని గుర్తిస్తే ప్రతి మనిషి తాము కోరుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోవచ్చు.
కారణం ఏదైనా ఎవరిని కించపరచకూడదు, అండగా నిలబడి వారు అనుకున్నది సాధించడం కోసం మీ వంతు సహాయం మీరు చేయాలి. మీరు ఒక్కరే విజయాన్ని అందుకుంటే సరిపోదు, మీ తోటి వారు మీ వారు కూడా విజయం అందుకున్నప్పుడే అసలు సంతోషానికి అర్ధం. కాబట్టి ప్రతి మనిషిని వారి యొక్క లక్ష్యాన్ని గౌరవించండి. అప్పుడే మీకు విలువ మీ విజయానికి ఒక గౌరవం దొరుకుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: