విజయం మీదే: విజయానికి ఈ సాధనాలు కీలకం...

VAMSI
భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ బ్రతుకుతున్నారు. వారితో పాటుగా మనము కూడా బ్రతికేస్తున్నాము. అలా ఉంటే సరిపోతుందా? మనకంటూ ఒక గుర్తింపు లేదా గుర్తింపు లేని జీవితం వృధా? కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. చేసే ప్రతి పని వేసే ప్రతి అడుగు సమాజంలో గుర్తింపు ఉండాలని గుర్తుంచుకోండి. దేని కోసం మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి అప్పుడే నువ్వు ఏమిటి..?? నువ్వు ఎవరు..?? నీకు ఈ సమాజం నుండి దక్కే గౌరవం ఏమిటి..?? అన్నది తెలుస్తుంది. మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. గౌరవం మాత్రమే కాదు కోరుకున్న జీవితం, సౌకర్యవంతమైన జీవితం దొరుకుతుంది.

లక్ష్యాన్ని చేధించాలి అంటే కష్ట పడాలి అలాగే అందుకు తగ్గట్టుగా మన గమనం ఉండాలి. అయితే విజయాన్ని అందుకోవాలి అంటే అందుకు కొన్ని సాధనాలు అవసరం. అవేంటో ఇపుడు తెలుసుకుందాం.

లక్ష్యాన్ని ఎంపిక చేసుకునే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. మన ఆలోచనలే మన నిర్ణయాలను నిర్ణయిస్తాయి... ఆలోచనలే ఆయుధాలుగా మారుతాయి.

మీ ప్రతి ఆలోచన మీరు విజయాన్ని అందుకోవడానికి ఒక మెట్టు కావాలే తప్పా... మిమ్మల్ని వెనక్కి లాగే అవకాశం కాకుండా జాగ్రత్త పడాలి. అందుకే ఆలోచన విధానం చాలా ప్రదానం.

లక్ష్యాన్ని ఎంపిక చేసుకున్న తరవాత వెను తిరిగి చూడకూడదు. కష్టమైనా నష్టమైనా పయనాన్ని ఆపరాదు. అవరోధాలు కలిగినపుడు వాటిని ఎదుర్కోవడానికి కావలసిన సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాలి. వాటిని ఆపడానికి
ప్రయత్నం జరగాలి.

మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి, మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. అలాగని నిరుత్సాహ పడకుండా ముందుకు సాగండి. మనకు అసాధ్యం అనుకుంటే అక్కడే ఆగిపోతాము, ప్రయత్నం అనేది జరిగినప్పుడే దేన్ని అయినా సాధ్యం చేసి చూపగలం.

పైన తెలిపిన విషయాలన్నీ గుర్తుంచుకుని మీ లక్ష్య సాధనలో వాడుకుంటూ అనుకున్నది సాధించి సమాజంలో మీకంటూ ఒక గుర్తిపును సంపాదించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: