విజయం మీదే: వేరొకరిని బాధ పెట్టే విజయం అవసరమా ?

VAMSI
మనము మనిషిగా పుట్టాక చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాము. అందులో మంచి చెడు రెండూ ఉంటాయి. అయితే మనకు ఏమి కావాలో అవి నేర్చుకుంటూ ముందుకు నడవాలి. అంతే కానీ ఎక్కడైనా చెడు మార్గంలో వెళ్ళినా లేదా మన అనుకున్న వారిని అన్యాయం చేసి విజయం సాధించినా అది సంతృప్తికరం మరియు శ్రేయస్కరం కాదు. ఒకరినొకరు బాధ పెట్టుకుని పొందే విజయానికి ఎప్పుడూ విలువ ఉండదు. అనుకున్నది సాధించాలని అందరికీ ఉంటుంది, కోరుకున్న గమ్యాన్ని చేరే ఆకాంక్షతో వచ్చే ప్రతి అవకాశం వదులుకోకుండా వినియోగించుకోవాలని చూస్తుంటారు.

అయితే కొన్నిసార్లు మన లక్ష్యాన్ని అందుకోవడం  కోసం ఆ అవకాశాలను వినియోగించే క్రమంలో మన అనుకున్న వాళ్ళకి బాధ కలిగించినా పట్టించుకోము. అది చిన్న బాధ అయితే ఒక రకంగా పర్వాలేదు. కానీ తీరని నష్టం అయితే ఖచ్చితంగా కాకూడదు. ఒకవేళ అలా మన వారిని బాధించి విజయాన్ని అందుకోవాల్సి వస్తే అలాంటి విజయాన్ని అందుకోకపోవడమే మంచిది. అలా కాకుండా మనకు మన విజయమే ముఖ్యం అనుకుంటే అలాంటి విజయానికి ఎలాంటి విలువ ఉండదు. ఈ విషయాన్ని గ్రహించి నిర్ణయాన్ని తీసుకోవడం మంచిది. విజయాన్ని అందుకోవడం ఎంత ముఖ్యమో మన అనుకున్న వారిని మనమే స్వయంగా నష్ట పరచకుండా చూసుకోవడం కూడా అంతే ప్రదానం.

నీటిలో మునగకుండా ఉండాలంటే విజయపు నౌకను అందుకోవడం అవసరమే. అయితే ఆ నౌకలో నీతోపాటు నీ వారు కూడా ఉండాలి అనుకోవాలి. అలా కాకుండా వారికి ఏమైనా పర్వాలేదు, అని వారిని వదిలి ఒంటరిగా నీ దారి నీవు చూసుకుంటే ముందున్న మార్గం ఇంకా కఠినతరం కావచ్చు, ప్రయాణం సమస్యల వలలో చిక్కుకోవచ్చు. కానీ ఎప్పుడూ నీకు అండగా ఎవరు నీ వెంట నిలువరు. కాబట్టి ఇవన్నీ తెలుసుకుని అందరినీ మంచిగా చూసుకుంటూ మీ ప్రయాణాన్ని కొనసాగించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: