విజయం మీదే: ఈ లక్షణం మీలో ఉంటే ఎదుగుదల కష్టమే?
అలాంటి ఆలోచనలు, స్వభావం ఉన్న వారు ఎప్పటికీ గౌరవాన్ని పొంద లేరు. అందరూ బాగుండాలి ఆ అందరిలో మనం ఉండాలి అనుకోవడం ఉత్తమం, అదే అసలైన విజయం. అంతే కాని కుల్లుతనం, పెంకితనం చూపరాదు. నేడు మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు, అలాగే సంతోషాలు... పుట్టినప్పటి నుండి మరణం వరకు ప్రతీది ఏదో ఒక భావంతో ముడిపడి ఉంటుంది. ఇది కూడా శాశ్వతంగా ఉండి పోదు, ఒకసారి నవ్విన నీ పెదాలు మరో సారి కళ్లల్లో నీళ్ళు చూసి కుమిలిపోతాయి. అలా ఎప్పుడూ ఒకేలా ఉండదు కాలంతో పాటుగా మన జీవితాలు కూడా మారుతూ ఉంటాయి.
ఇక్కడ సమస్యలు వారివి, ఎవరి సంతోషాలు వారివి. మన మనసును వీలైనంత ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇలాంటి వారు వారికి వారు సర్దిచెప్పుకోవడానికి మనకంటే గొప్ప వారిని చూసి అసూయ పడటం కంటే వారి లాగా మనము సంతోషంగా ఉండాలి, సౌకర్యంగా బ్రతకాలి అని ఆకాంక్షించాలి, అందుకోసం ప్రయత్నించాలి.