విజయం మీదే: కాలం వృధా చేశారా... ఓటమి తప్పదు

VAMSI
సమయాన్ని గౌరవించేవారు, సమయానుసారంగా నడుచుకునే వారు విజయాన్ని అందుకుంటారు. సమయాన్ని వృదా చేస్తూ టైం కి విలువ ఇవ్వని వారు విజయాన్ని అందుకోవడం చాలా కష్టం.  ప్రతి ఒక్కరి లక్ష్యం అనుకున్న లేదా కోరుకున్న దాన్ని సాధించి విజయాన్ని అందుకోవడం మాత్రమే. అలాంటప్పుడు ప్రణాళిక ఎంత అవసరమో ఆ ప్రణాళికను క్రమం తప్పకుండా సమయానికి పాటిస్తూ పోవడం కూడా అంతే ముఖ్యం. ప్రణాళిక వేసుకుంటే సరిపోదు దాన్ని సరిగ్గా పాటించాలి, సమయాన్ని ఏమాత్రం వృదా చేయకుండా ముందుకు సాగాలి.
ఎప్పటి పనులు అప్పుడే చక్క బెట్టుకోవాలి, పూర్తి చేసుకోవాలి. సోమరి పోతు తనంతో బద్దకంతో ఉంటే పనులు కావు, నీవు ఎంత సమయాన్ని అయితే వృదా చేస్తావో? నీకు విజయాన్ని అందుకోవడం కూడా అంతే లేటు అవుతుంది. అందుకనే సమయాన్ని వృదా చేయరాదు.  నైతికతతో సాధించే విజయానికి సంబంధించిన ప‌లు విధానాలలో కాలం కూడా ముఖ్యమైనది. ప్రతి పని పూర్తి చేయడానికి ఒక నిర్ణీత కాలం పెట్టుకోవాలి. ఆ గడువు లోపు ఆ పనిని పూర్తి చేయడమే మీ లక్ష్యం అవ్వాలి. అపుడే మీరు విజయానికి దగ్గర అవుతారు.
ఇచ్చిన సమయం లోపే బాస్ ఇచ్చిన పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది, లేదంటే ప్రశంసలకు బదులుగా విమర్శలు దక్కుతాయి. పొద్దునే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అన్ని ఒక ప్రణాళిక ప్రకారం ఖచ్చితంగా చేయలేక పోవచ్చు. కానీ సమయాన్ని వృదా కాకుండా చూసుకోవాలి. అదే మీ తొలి విజయం అవుతుంది. కాలం ఎంత విలువైనది అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే  కాలంతో పరుగులు తీయలసి ఉంటుంది. అపుడే కాలం మీకు కలిసివచ్చే విజయాన్ని తెచ్చి పెడుతుంది. ఇప్పుడు మీరు తెలుసుకున్నదంతా మీ రోజు వారీ ప్రణాళిక లో అమలు చేయండి. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లో చాలా కోల్పోవాల్సి వస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: