ఢిల్లీకి ఎగ‌సిన.. గుడివాడ ఘ‌న కీర్తి.. కోటిరెడ్డికి మ‌రో అవార్డు

VUYYURU SUBHASH
ఎవ‌రో ఒక‌రు ఎపుడో అపుడు.. న‌డ‌వరా ముందుగా.. అన్న‌ట్టుగా.. మ‌ట్టి పాదాల‌ను అంటుకున్న న‌డ‌క‌.. మ‌హోన్నత  శిఖరం వైపు దూసుకుపోయింది. పొలం ప‌నులు త‌ప్ప‌.. ఇంకేం చేస్తాం.. అన కుటుంబం నుంచి స‌ర్వ‌ప్ర‌పంచాన్ని అవ‌లీల‌గా ఏల‌గ‌లిగిన వ్య‌క్త‌ల‌ను ఆద‌ర్శంగా తీసుకున్న ఆ యువ‌కుడు త‌న స‌త్తా చాటాడు.. ప్ర‌పంచం నివ్వెర పోయేలా.. తెలుగు య‌శ‌స్సును.. కృష్ణా జిల్లా ఘ‌న కీర్తిని ఢిల్లీ రాజ‌ధాని వ‌ర‌కు తీసుకువెళ్లి.. త‌న‌కు తానే సాటి అని నిరూపించుకున్నాడు.. ఆయ‌నే టెక్ దిక్క‌జం.. వేలాది మంది కుటుంబాల్లో ఉపాధి దీపాలు వెలిగిస్తున్న ప్ర‌ఖ్యాత‌.. కోటీ గ్రూప్ ఆఫ్ వెంచ‌ర్స్ అధినేత స‌రిప‌ల్లి కోటిరెడ్డి.

నువ్వు క‌ష్ట‌ప‌డు.. ప్ర‌పంచం నీవెంటే వ‌స్తుంది.. అన్నారు.. అల్బ‌ర్ట్ ఐన్ స్టీన్‌. ఈ మాట‌ను న‌మ్మిన‌.. కోటిరె డ్డి.. నిరంత‌ర సాధ‌న‌తో ముందుకు సాగారు. తిన్నారో.. తిన‌లేదో.. కంటిపై కునుకు ఉందో లేదో.. కూడా ఆయ‌న చూడ‌లేదు. త‌న జీవితంలో అనేక మైలు రాళ్ల‌ను ల‌క్ష్యంగా నిర్దేశించుకుని ముందుకు సాగారు. ఆ ల‌క్ష్య సాధన‌లో ఆయ‌న ఎన్న‌డూ వెనుదిరిగి చూసుకున్న‌ది లేదు. నిరంతర శ్రామికుడికి అలుపు  ఉండ‌ద‌నే సూక్తిని ఆయ‌న నిజం చేశారు. ఒక్క త‌న ప్రాంత‌మే కాదు.. త‌న దేశం.. ఈ ప్ర‌పంచ‌మే త‌న‌వైపు తిరిగి చూసేలా.. అడుగులు వేశారు.

ఈ క్ర‌మంలోనే నేడు.. ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జాల స‌ర‌స‌న ఆయ‌న ఒక‌రుగా ఠీవీగా నిల‌బ‌డ్డారు. దేశ కీర్తిని.. త‌న య‌శ‌స్సును హిమ‌వ‌న్న‌గ‌మంత స్థాయికి తీసుకువెళ్లారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ను అనేక అవార్డులు వ‌ల‌చి వ‌చ్చాయి. టెక్ దిగ్గ‌జంగా.. ప్ర‌పంచ పేరు ప్ర‌ఖ్యాతుల‌ను సొంతం చేసుకున్న ఆయ‌న‌ను కీర్తించ‌ని గొంతు లేదు.. కొనియాడ‌ని మీడియా లేదు. తాజాగా ఆయ‌న   భార‌త్ వ‌ర్చువ‌ల్ పీస్ అండ్ ఆర్గ‌నైజేష‌న్ సంస్థ కోటిరెడ్డికి డాక్ట‌రేట్‌ను అందించింది.

ఈ నెల 23న ఢిల్లీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో కోటిరెడ్డి స‌రిప‌ల్లికి కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావ‌లే చేతుల మీదుగా.. ఈ డాక్ట‌రేట్ను అందించారు. ఈ డాక్ట‌రేట్ వ‌ల్ల‌.. కోటిరెడ్డి కంటే.. కూడా ఆ అవార్డుకే ఎన‌లేని గౌర‌వం ఇనుమ‌డించిద‌న‌డంలో సందేహం లేదు.  ఒక కృషి-ఒక ప‌ట్టుద‌ల ఉంటే.. విజ‌యం త‌నంత‌ట త‌నే చేరువ అవుతుంద‌న‌డానికి ఈ ప్రపంచం మోక‌రిల్లుతుంద‌న‌డానికి ఇది ఒక మ‌చ్చుతున‌క మాత్ర‌మే. కోటిరెడ్డి స‌మున్న‌త ల‌క్ష్యంలో ఇదొక చిన్న ప్రోత్సాహం మాత్ర‌మేన‌ని అంటున్నారు ఆయ‌న గురించి తెలిసిన వారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: