కార్య‌సాధ‌కుడు కోటిరెడ్డికి మ‌రో డాక్ట‌రేట్‌.. అత్యున్న‌త గౌర‌వం ద‌క్కించుకున్న తెలుగు బిడ్డ‌

VUYYURU SUBHASH
స‌రిప‌ల్లి కోటిరెడ్డి. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి.. ఇంతింతై.. అన్న‌ట్టుగా ఎదిగి.. ఎవ‌రూ ఊహించ‌ని.. అత్యున్నత అమేయ శిఖ‌రాలను అందుకున్న తెలుగు బిడ్డ‌. కృష్ణా జిల్లా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలోని ఒక మారుమూల ప‌ల్లె లో జ‌న్మించిన ఆయ‌న‌.. ప‌దో త‌ర‌గతితోనే చ‌ద‌వును ఆపేసినా.. త‌న‌కంటూ.. ప్ర‌త్యేక‌త ఉండాల‌నే త‌ప‌న తో అహ‌ర‌హం శ్ర‌మించారు. మైక్రోసాఫ్ట్‌ను మెప్పించిన ధీరుడుగా కీర్తి సంపాయించుకున్నారు.

కోటిరెడ్డి గ్రూప్ ఆఫ్ వెంచ‌ర్స్‌ను స్థాపించి.. అనేక వ్యాపారాల్లో ముందంజ‌లో ఉన్నారు. దాదాపు ప్ర‌పంచ వ్యాప్తం గా కోట్ల రూపాయ‌ల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రించారు. అంతేకాదు.. తాను న‌మ్మిన సిద్ధాంతానికి క‌ట్టుబ‌డిన ఇండ‌స్ట్రియ‌లిస్టుగానే కాకుండా.. ఉద్యోగుల ప‌ట్ల సాను కూల దృక్ఫ‌ధం ఉన్న య‌జ‌మానిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. ఉద్యోగుల కుటుంబాల‌ను సైతం త‌న కుటుంబాలుగా భావించే య‌జ‌మాని ఆయ‌నే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ప్ర‌తి విష‌యంలోనూ..  ఆయ‌న త‌న‌దైన అడుగులు వేస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ ఆదుకుంటున్నారు. మ‌రోవైపు మీడియా రంగంలోనూ.. త‌న‌దైన శైలితో దూసుకుపోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు అనేక అవార్డులు వ‌రించి వ‌స్తున్నాయి. స‌త్తా ఉన్న చోట‌కు .. స‌క‌ల అవార్డులు వ‌స్తాయ‌నే చందంగా.. ఇప్పుడు మ‌రో.. అవార్డు.. కోటిరెడ్డిని వ‌రించింది. అదే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌.. డాక్ట‌రేట్‌. భార‌త్ వ‌ర్చువ‌ల్ పీస్ అండ్ ఆర్గ‌నైజేష‌న్ సంస్థ కోటిరెడ్డికి డాక్ట‌రేట్‌ను అందించింది.

ఈ నెల 23న ఢిల్లీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో కోటిరెడ్డి స‌రిప‌ల్లికి కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావ‌లే చేతుల మీదుగా.. ఈ డాక్ట‌రేట్‌ అందించారు. ఈ డాక్ట‌రేట్ వ‌ల్ల‌.. కోటిరెడ్డి కంటే.. కూడా ఆ అవార్డుకే ఎన‌లేని గౌర‌వం ఇనుమ‌డించిద‌ని..ఈ  సంద‌ర్భంగా కేంద్ర మంత్రి పేర్కొన‌డం గ‌మ‌నార్హం. కృషి ఉంటే మ‌నుషులు రుషులౌతారు.. అన్న సూత్రాన్ని మ‌న‌సా వాచా క‌ర్మ‌ణా న‌మ్మిన కోటిరెడ్డికి ల‌భించిన ఈ గౌర‌వం.. ఆయ‌న శిగ‌లో చేరిన మ‌రో క‌లికితురాయి.. అన‌డంలో సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: