విజయం మీదే: పిల్లల విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నారా?

VAMSI
మన పిల్లల విజయం ఎప్పటికీ మన విజయం అవుతుంది. ఎంత కష్టపడి సంపాదించినా అంతా వారి కోసమే కదా. మరి అలాంటప్పుడు వారి భవిష్యత్తుకు మనం అడ్డు కాకూడదు. చాలా మంది తల్లితండ్రులు పిల్లల్ని క్రమశిక్షణ పేరుతో ఎప్పటికప్పుడు వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారికి ఉన్న చిన్ని చిన్ని ఆశలను, ఆలోచనలను ఎప్పటికప్పుడు అణిచి వేస్తుంటారు. అది చేయకూడదు, ఇది చేయ కూడదు అలా అనకూడదు ఇలా ఆలోచించకూడదు అంటూ..వారిని ఆదేశిస్తుంటారు. కానీ ఇలా చేయడం వలన పిల్లల్లో చిన్నతనం నుండే ఒక తెలియని బెరుకు తనం, సంకోచం వంటి భావాలు ఏర్పడుతాయి. న్యూనతా భావం ఎక్కువ అవుతుంది.
ఇవన్నీ కలిసి వారి సామర్ధ్యానికి సంకెళ్లు వేస్తాయి. అలా పిల్లల్లో ఏదైనా సాధించగలం అనే దైర్యం కన్నా...అసలు మనం ఏదైనా చేయగలమా అన్న అప నమ్మకం ఏర్పడుతుంది. ఈ ఆలోచనలు అన్ని మీ పిల్లల విజయ దారిలో అవరోధాలు కలిగించి గమ్యాన్ని చేరుకోనివ్వకుండా అడ్డుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే పిల్లలకు స్వేచ్చ ఇవ్వడం అవసరం, అలాగే వారి స్వేచ్ఛకు పరిమితిని కూడా వారికి సున్నితంగా తెలిసేలా చేయాలి.  మంచి చెడుల విచక్షణ తెలుసుకునేలా చేయగలగాలి. అవగాహన పెంచాలి, సమర్థవంతమైన పౌరులుగా తీర్చి దిద్దాలి. సంఘంలో మీ పిల్లలకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉండేలా ప్లాన్ చేయాలి.
పిల్లల పై మీ ప్రభావం ఎక్కువగా పడకుండా జాగ్రత్తగా వారిని  పెంచగలగలిగితే వారి జీవితంలో విజయాలను అందుకోవడంలో సఫలం అవుతారు. మీ బాధ్యత వారి వెంట నడుస్తూ ముందుండి మార్గాన్ని చూపడం మాత్రమే కాదు, వారికి కావాల్సిన చక్కని వాతావరణాన్ని సృష్టించడం కూడా అన్నది అర్దం చేసుకోవాలి. అయితే ఈ విషయాలను ప్రతి ఒక్క తల్లితండ్రులు గుర్తుంచుకుని వారిని విజయాన్ని అందుకోవడానైకి సరైన అవకాశాలను సృష్టించాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: