విజయం మీదే: మీ ప్రవర్తనే గెలుపు ఓటమిని నిర్ణయిస్తుంది
నీకంటూ నలుగురు వ్యక్తులు లేని జీవితం వృదా అని పెద్దలు చెబుతారు. అవును అది నిజమే..ఎన్ని సిరిసంపదలు ఉన్నా మన కష్ట సుఖాలను పంచుకునే మనం అనే వ్యక్తులు లేకపోతే కోట్లాది రూపాయిలు ఉన్నా సంతోషాన్ని కలిగించలేవు. కడు పేదరికంలో ఉన్నా మన అనుకునే వారు మన వెంట ఉండి ప్రోత్సహిస్తే ఎంత పెద్ద సమస్య అయినా అధిగమించి విజయాన్ని అందుకోవచ్చు. కానీ మన సంతోషాన్ని కాదు దుఃఖాన్ని కూడా పంచుకునే తోడు ఉంటేనే అసలైన విజయం మన సొంతం అవుతుంది. కావున ఇత్రులతో మీ ప్రవర్తన ఎప్పుడూ కూడా సౌమ్యంగా ఉండాలి. మాటల్లో నిజాయితీ, నిదానం ఉండాలి.
కుటుంబ సభ్యులైనా, సన్నిహితులు అయినా మీ ప్రవర్తనే వారి మనస్సులో మీ స్థానాన్ని నిర్ణయిస్తుంది. అందుకే మాట పొదుపు అన్నారు పెద్దలు. మనకంటే తక్కువ అయినా ఎక్కువ అయినా పెద్ద అయినా చిన్న అయినా వారితో నడుచుకునే పద్దతి, మాట్లాడే తీరు వారిలో మనపై ఒక అభిప్రాయాన్ని కలిగేలా చూస్తుంది. వీలైనంత వరకు అందరితో మంచిగా ఉండాలి. ఒకవేళ మనస్పర్ధలు వచ్చినా, ఎదుటి వారిపై కోపం వచ్చినా మాట తూల కూడదు. ఏ మాట అయినా సరే పెదవి దాటేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.