విజయం మీదే: గెలుపులో ప్రోత్సాహం ఎంతో ముఖ్యం...

VAMSI
జీవితమనే పయనంలో ఏదీ శాశ్వతం కాదు. గడిచిన ప్రతి నిముషం జ్ఞాపకం అవుతుందే తప్ప మనకు నచ్చిందని అలా ఆగి పోదు. అది సుఖమైనా దుఃఖమైనా, సంతోషమును నింపిన సందర్భము అయినా లేక మనశ్శాంతిని దూరం చేసినా సమయం గడిచి పోతుంది. కానీ గడిచిన కాలంలో మీరు సాధించిన విజయాలు చిరకాలం అందరికీ గుర్తుండి పోతాయి. అందరి లోనూ మీకు గుర్తింపును తెచ్చి పెడతాయి. అందుకే విజయం అంటే అందరికీ అంత మక్కువ. మీకు గుర్తింపును మాత్రమే కాదు. మీ భవిష్యత్తుకు పూల బాట వేస్తాయి. సౌకర్యవంతమైన జీవితానికి పునాది వేస్తాయి.
అవే మిమ్మల్ని జీవితంలో మంచి స్థాయిలో నిలబెడతాయి. ఇక విజయం అందుకోవడంలో ప్రోత్సాహం ముఖ్య పాత్రను పోషిస్తుంది. మీ వారు అనగా మీ పిల్లలు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ లేదా మీ స్నేహితులో, సన్నిహితులో కావొచ్చు. ఎవరైనా సరే వారు గట్టిగా నిశ్చయించుకుని ఎలాగైనా  సాధించాలి అని సంకల్పించినప్పుడు వారి నిర్ణయాన్ని గౌరవించండి, వారికి సహకరించండి. అంతే కానీ అడ్డు చెప్పకండి. ఇలాంటప్పుడే మీ ప్రోత్సాహం ఎంతో అవసరం. మీరు అందించే ఆ చిన్న ప్రోత్సాహం వారిలో కొత్త ఉత్తేజాన్ని నింపి వారిని ముందుకు నడిచేలా చేస్తుంది. వారు విజయాన్ని అందుకునేందుకు ప్రేరణ కలిగిస్తుంది.
అందుకే ఎవరితో ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా లేక మనస్పర్ధలు ఉన్నా అవి గతం మాత్రమే అవి మీ లేదా మీ ఆత్మీయుల విజయానికి అడ్డు కాకూడదు.  అందరూ అనుకున్నది సాధించకపోవచ్చు, కొందరు  విజయాన్ని అందుకొని ఆనందంలో మునిగి పోగా ఇంకొందరు అపజయం పాలయ్యి నిరాశ చెందుతారు. అలాంటప్పుడే మీరు మీ వారికి అండగా నిలబడాలి, వారికి దైర్యం చెప్పి  మళ్ళీ ప్రయత్నించమని విజయం తప్పక అందుతుందని వారిని ప్రోత్సహించాలి. యిది చాలా ముఖ్యమైనది మనము ఒకరిని గెలిపించడంలో ఉన్న ఆనందం ఎక్కడా దొరకదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: