విజయం మీదే: ఒంటరితనంతో గెలుపు మీ సొంతం...?

VAMSI
విజయం అందుకోవాలంటే ఎన్నో సూత్రాలు ఉన్నాయి. విజయం అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కలను సంపూర్ణంగా నెరవేర్చుకునేందుకు అందరూ ఎంతగానో శ్రమిస్తుంటారు. కానీ విజయం అందుకోవాలంటే కష్టం ఒకటే ఉంటే సరిపోదు. సరైన ప్రణాళిక, సమయస్పూర్తితో కూడిన ఆలోచనలు వంటివి కూడా అవసరమే. ఐక్యమత్యంతో ఉంటే ఏదైనా సాధించవచ్చని ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని పెద్దలు అంటుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మీ ఒంటరితనమే మిమ్మల్ని విజయవంతంగా నిలబెడుతుంది అంటున్నారు కొందరు మేధావులు. అవును ఇది నిజమే జీవితం అన్న తరువాత సమస్యలు సహజమే. ఎంచుకున్న ప్రతి మార్గంలోను ఎంతో కొంత సమస్య ఉండనే ఉంటుంది.
అయితే ప్రతి సమస్యను పది మందిలో ఉంచి పరిష్కారం కోసమో , ఓదార్పు కోసమో ఎదురు చూస్తే పొరపాటే. కొన్ని సమస్యలకు ఒంటరిగానే ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా నలుగురికి వాటి గురించి చెబితే సమస్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఉదాహరణకు వ్యాపార అభివృద్దే తమ విజయంగా భావించే వారు, తమ వ్యాపారంలో సమస్యలు వచ్చినప్పుడు వాటిని అందరికీ చెప్పి సలహాలు తీసుకోవడం మంచిది కాదని కొందరి వ్యాపార వేత్తల అభిప్రాయం. ఎందుకంటే వ్యాపార రంగంలో ఎక్కువ మంది ప్రత్యర్ధులు ఉంటారు వారిని అధిగమిస్తేనే మీకు విజయం అందుతుంది అలాంటప్పుడు మీ వ్యాపార సమస్యలు అంటే అవి రహస్యాలు అలాంటపుడు వాటిని అందరికీ చెప్పరాదు.
ఒంటరిగానే డిసిషన్ తీసుకోవడం మంచిది లేదా మీ కుటుంబ సభ్యులతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకుని ఫైనల్ గా డిసైడ్ అవ్వడం మంచిది. వ్యాపారం అని మాత్రమే కాకుండా మానసికంగా మీరు కుంగిపోయి సమస్యలు ఎదురైనప్పుడు ఒంటరిగా ఉండి ఆలోచించడం వలన మీ తప్పొప్పులు, సామర్థ్యాలు అన్నిమీకే అర్థమవుతాయి. ఒంటరి తనం కొన్ని సందర్భాల్లో మరింత కంఫర్ట్ గా ఉంటుంది. అది మీకు సమస్యల నుండి బయట పడడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: