విజయం మీదే: గెలవాలంటే ఈ తప్పులు చేయొద్దు ?

VAMSI
ఈ ప్రపంచంలో ఉన్న వారెవ్వరూ విజయం అంటే నచ్చని వారు ఉండరు. జయాన్ని పొందాలని అనుకోని వారే ఉంటారు. కానీ అందరికీ విజయం అనుకున్న వెంటనే దక్కుతుందా అంటే లేదనే చెప్పాలి. ప్రతి ఒక్కరికీ విజయం అందుకోవాలనే ఆశ ఉన్నా, ఎంతో కష్టపడి అహర్నిశలు శ్రమించినా, అందరికీ ఆ భాగ్యం వెంటనే కలుగక పోవచ్చు. ఎన్ని సార్లు ఓటమి ఎదురైనా, వాటిని అనుభవాలు నేర్పిన గుణపాఠాలుగా నేర్చుకుని ముందడుగు వేసి మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తేనే అనుకున్నది సాధించ గలరు. మీరు అనుకున్న ఆశయాన్ని నెరవేర్చుకోగలరు. గెలుపు పొందాలి అంటే అస్సలు చేయకూడని కొన్ని పొరపాట్ల గురించి ఇప్పుడు చూద్దాం.
* జీవితంలో గెలుపు, ఓటమి అనేవి సహజం. కొన్ని సార్లు కొన్ని సందర్భాల్లో మనం గెలవవచ్చు, కొన్ని సందర్భాల్లో మనం ఓటమి పాలు కావొచ్చు. కానీ ఇక్కడే మనం స్థిరంగా ఉండాలి.

* ఆత్మ విశ్వాసం లేని ప్రయత్నం వృధా. మనపై మనకు నమ్మకం లేకుండా ఏ పని చేసినా సరే అది సంపూర్ణంగా పూర్తి కాదు గెలవడం కూడా చాలా కష్టం అవుతుంది.
* సాధించాలనే కసి, పట్టుదల మిమ్మల్ని ముందుకు నడుపుతుంది. పట్టుదల లేని ప్రయత్నం ఎంత చేసిన పనికి రాదు. అది కూడా అధికంగా పట్టుదల ఉంటేనే మీ ప్రయత్నం మరింత బలంగా మారుతుంది.


*ఒకటి రెండు సార్లు ఓడిపోయినా సరే.. స్థిరమైన  ఆత్మవిశ్వాసంతో అన్నిటినీ అధిగమించి ఆశయాన్ని నెరవేర్చుకోవాలి. అయితే ఈ ప్రయత్నంలో
మనం ఎన్ని సార్లు ఫెయిల్యూర్ అవుతామో దానికి గల కారణాలను తెలుసుకొని ఆ పొరపాట్లను మళ్లీ మళ్లీ చేయకుండా జాగ్రత్త పడాలి. తిరిగి అదే తప్పులు రిపీట్ కాకుండా చూసుకుంటూ ఎంచుకున్న మార్గంలో ముందుకు పయణించాలి.

అలా ఎన్ని ఆటు పోట్లు ఎదురైనా అన్నిటినీ సమయస్ఫూర్తితో ఎదుర్కొంటూ కోరుకున్న ఆశయాన్ని సాధించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: