విజయం మీదే: ప్రయత్నమే... విజయానికి తొలిబాట !

VAMSI
ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ విజయాన్ని సాధించాలి అని కోరిక ఉంటుంది. అయితే ఇది అందరికీ సాధ్యపడేది కాదనే విషయం చాలా మందికి తెలిసి ఉండదు. విజయం అంటే కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం మాత్రమే కాదు, ఇతరుల మెప్పును పొందడం, వారితో గౌరవింప బడటం వంటివి కూడా విజయాలే. అయితే ప్రతి ఒక్కరికీ వారికంటూ ఓ జీవితాశయం ఉంటుంది. ఆ ఆశయాన్ని అందుకోవడం కోసం పరుగులు తీస్తుంటారు. కొందరు తమ లక్ష్యాన్ని చేరుకోగా..మరి కొందరు ఒకటి రెండు ప్రయత్నాలకే విసుగు చెంది మధ్యలోనే విరమించుకుని వెనుతిరిగి వెళ్ళిపోతారు. ఎందరో మహా మహా విజ్ఞానవంతులు సైతం ఎన్నో సార్లు శతవిధాల ప్రయత్నిస్తే కానీ విజయం అందలేదు. మరి మనం ఒకటి రెండు సార్లకే నిరుత్సాహపడి మన సంకల్పాన్ని విరమించుకోవడం అన్నది ఎంత పెద్ద పొరపాటు అనే అంశం గమనించాలి.
విజయానికి ఆత్మ విశ్వాసం అనేది ఎంత ముఖ్యమైనదో అదే విధంగా ఆత్మ విశ్వాసానికి సాధన అంత అవసరం. మన ప్రయత్నం ఒక సాదనే...ప్రతి  ఓటమి నుండి నేర్చుకోవాల్సింది. అలాగే మన ప్రయత్నంలో మార్చుకోవాల్సింది చాలానే ఉంటుంది.  ఓటమిని గుణపాఠంగా అనుకుని మరింత గట్టి ప్రయత్నం చేస్తే విజయం తప్పక అందుతుంది.
కష్టంతో పాటు ఓపిక కూడా ఉంటే ఎదో ఒకరోజు విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది. విజయాన్ని అందుకోవాలని మనస్పూర్తిగా, శ్రద్ధగా ప్రయత్నిస్తే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేమీ కాదు.
కాబట్టి మీరు విజయం కోసం చేసే ప్రయత్నంలో లోపం లేకుండా చూసుకోండి. ప్రతి ఒక్కరూ అనుకున్నహ్ది సాధించడం వీలు కాదు. దాని కోసం గట్టి ప్లానింగ్ మరియు సమర్ధత అవసరం. నిన్ను నువ్వు నమ్మినప్పుడే ఏదైనా సాధ్యం అవుతుంది. అలా కాకుండా కొందరు విజయం మాట దేవుడు ఎరుగు, అస్సలు ప్రయత్నమే చేయరు. అలాంటి వారు విజయం పొందడానికి ఏ మాత్రం అర్హులు కారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: