విజయం మీదే: ఈ "అక్కాచెల్లెళ్ల" విజయ గాధ చూసి స్ఫూర్తి పొందు మిత్రమా !

VAMSI
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను అందుకుంటున్నారు ఆ అక్కాచెల్లెళ్ళు. ఇక్కడ వారి పెట్టుబడికి అద్భుతమైన ఆలోచనలను జోడించారు. అంతే వారికి విజయం ఎగురుకుంటూ వచ్చింది. అంతేనా ఎక్స్ట్రా గా లాభాల మీద లాభాలు వచ్చి పడుతున్నాయి. ఇంకేముంది సక్సెస్ తో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగిపోయాయి. ఇపుడు వారు ఎవరు...వారి విజయం వెనకున్న రహస్యం ఏంటో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఇద్దరు పేద కుటుంబానికి చెందిన ఇద్దరు నజియా, ఇషా అనే అక్కాచెల్లెళ్లు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టి అందులో ఎదిగి నిరూపించాలని అనుకున్నారు. మొదట స్టార్టప్ ఆరంభించారు. డిజైనర్ శాండల్స్ (అందమైన కొత్త రకం చెప్పుల తయారీ మరియు వాటి అమ్మకం) వ్యాపారాన్ని ప్రారంభించారు. అలా కొత్త కొత్త డిజైన్ లతో ఆకర్షణీయమైన చెప్పులను తయారు చేసి అమ్మేవారు.
ఆ తర్వాత ఆన్లైన్ లో కూడా తమ చొప్పులను  అందుబాటులోకి తీసుకొచ్చారు. అలా తమ వ్యాపారాన్ని అంచెలంచెలుగా విస్తరించారు. మొదట వారి వ్యాపారానికి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి...ఇంటింటికీ తిరిగి చెప్పులను అమ్మిన రోజులున్నాయి. కానీ ఎక్కడా వారు నిరాశ చెందలేదు. వెంటనే లాభాలు దక్కలేదే అని బాధపడలేదు. ప్రజలకు ఇంకా కొత్తదనాన్ని చూపించి ఆకర్షించాలని వినూత్నంగా ఆలోచించారు. రకరకాల డిజైన్లతో తయారు చేశారు. అలా వారి డిజైనర్ శాండిల్స్ వ్యాపారాన్ని పైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విజయవంతంగా సాగుతోంది. నెలకు మూడు నుండి నాలుగు లక్షల వరకు సంపాదిస్తున్నారు.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు ఏమిటంటే,
* ముందుగా నిర్ణయం తీసుకోవాలి. వెంటనే ఆచరించాలి.
* నష్ట భయం పెద్దగా లేకుండా ఉండే వాటిని ఎంచుకోవాలి.
* మొహమాట పడితే కుదరదు. మనం చేసే పనిని గౌరవించాలి. కానీ నలుగురిలో తక్కువగా ఉందని ఫీల్ అవకూడడు. పని ఎప్పుడూ ఆ పరమాత్మతో సమానం. పని ఏదైనా శ్రద్ధతో కృషి చేస్తేనే దాని ఫలితం దక్కుతుందన్న విషయం అర్థం చేసుకోవాలి.
* ఓర్పు చాలా అవసరం మొదటి మెట్టుకే శిఖరం అందలేదు అని నిరుత్సాహ పడి వెనకడుగు వేస్తే ఎన్నటికీ ఉన్నతిని సాధించలేము.
* సమయస్ఫూర్తితో కూడిన ఆలోచనలను మనల్ని ముందుకు నడిపిస్తాయి. విజయం అందేవరకు ప్రయత్నం కొనసాగించు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: