విజయం మీదే: మీ బాస్ ను ఇలా ఇంప్రెస్ చేయండి...

VAMSI
ప్రస్తుత జీవితంలో ఉపాధి అనేది ఎంత అనివార్యమో అందరికీ తెలిసిందే. ఉద్యోగం చేసేవారు బాస్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలన్నా, తద్వారా మంచి పొజిషన్ లేదా ఇంక్రిమెంట్ వంటివి పొందాలన్నా.. బాస్ ని ప్రసన్నం చేసుకోవడం తప్పనిసరి. అయితే ఇది కేవలం మాటలతో మాత్రమే జరిగే పని కాదు. వారు చెప్పే పని మరియు ఇచ్చే ప్రాజెక్టులను సమర్థవంతంగాను, సజావుగాను ఇచ్చిన వ్యవధిలోనే పూర్తి చేయడం ప్రధానం. ప్రాజెక్ట్ కు ఐడియా మాత్రమే బాగుంటే సరిపోదు ప్రజెంటేషన్ కూడా కన్విన్సింగ్ గా ఉన్నప్పుడే బాస్ సంతోషిస్తాడు. తద్వారా మీ ఆకాంక్ష నెరవేరే అవకాశం లేకపోలేదు. అలా మీరు అనుకున్న మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఇంతకీ మీ ప్రాజెక్టు మరియు ప్రజెంటేషన్ ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవన్నీ అనుభవజ్ఞులైన కొందరు నిపుణులు చెబుతున్న మాటలు.
* ఐడియా మరియు కంటెంట్ మాత్రమే ఉంటే సరిపోదు దానికి పవర్ ఫుల్ ప్రజెంటేషన్ కూడా ప్రధానమే, అప్పుడే మీ బాస్ ను మీరు మెప్పించగలరు.
*సమయం ప్రకారం ప్రాజెక్ట్ చేసుకోవడానికి ముందుగా ప్రణాళికను సిద్ధం చేసుకోండి.
* అందుకు సంబంధించిన సమాచారాన్ని ఏమైనా అవసరమైతే కలెక్ట్ చేసుకోండి.
* ప్రాజెక్ట్ డిజైనింగ్ లోకి ఎంటర్ అవ్వకముందే ప్రతి రోజు వర్కింగ్ గ్రాఫ్ అనేది చాలా అవసరం. అప్పుడే పొరపాట్లు కానీ లోటు పాట్లు కానీ లేకుండా చేయడానికి సహాయపడుతుంది.
*ఇకపోతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు కటింగ్ ఎలా అయితే అవసరమో డిజైనింగ్ కూడా అంతే ముఖ్యం.
*అలాగని అందుకోసం ప్రొఫెషనల్ డిజైనర్ పెట్టుకుందామంటే ఖర్చు కాస్త బడ్జెట్ దాటేస్తుంది. కాబట్టి స్వయంగా ప్రజెంటేషన్ లను తయారు చేసుకోవడం మేలు.
* ఇది కాస్త కష్టమైన పని అయినా.. అసాధ్యం అయితే కాదు. కొంచం బుర్ర అలాగే మీ సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
* ఇందుకు సానుకూలంగా  ఇంటర్నెట్ లో ఎడిటింగ్ టూల్స్ ఎలాగో బోలెడన్ని ఉన్నాయి.
* సెర్చ్ చేసి, ఎవరికి తగ్గట్టుగా వారు ఎంపిక చేసుకోగలిగితే చాలు.
*ఇంకా మీకు డీటెయిల్ గా కరెక్ట్ గా కావాలి అంటే...స్కెచ్ బబుల్ అని గూగుల్ లో టైప్ చేసినట్లైతే మీ కంటెంట్ కి తగ్గ డిజైన్ లు దొరుకుతాయి.
* ఇక్కడ జస్ట్ టెంప్లేట్ సెలక్ట్ చేసి, కంటెంట్ యాడ్ చేసుకుని, మీ ఐడియాకు అనుగునంగా కొన్ని బేసిక్ ఛేంజెస్ చేసినట్లైతే అంతే మంచి విజువల్స్ తో మీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇక రెడీ అయిపోయినట్లే సుమీ. ఇంకా దీని గురించి మరిన్ని వివరాలు పాయింట్ టు పాయింట్ తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి.
* ఇక ప్రజెంటేషన్ మొత్తం రెడీ చేసుకున్నప్పటికీ.... ప్రజెంటేషన్ ఇచ్చేముందు ... స్టార్టింగ్ పాయింట్... నుండి ఎండింగ్ పాయింట్ వరకు హైలెట్స్ ను నోట్ చేసుకుని మీ బాస్ లేదా టీం ముందు ప్రజెంట్ చేస్తే చాలు ఇక మీకు ప్రశంసల వెల్లువే. అలాగే అనుకున్నది కూడా పొందే అవకాశం మెండుగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: