విజయం మీదే: ఈ ఒక్క లక్షణం మీలో ఉందా... సర్వ నాశనం ?

VAMSI
ఈ జీవరాశిలో ప్రతి ఒక్క జీవి తన పరిధి మేరకు సంతోషంగా జీవిస్తుంది. దేవుడు సృష్టించిన ఈ ప్రపంచం ఎవరికీ సొంతం కాదు. ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో ఉండేది కొంతకాలం వరకే, తరువాత మరో లోకానికి వెళ్ళక తప్పదు. అయితే ఈ వాస్తవం అందరికీ బోధపడదు. ఇది తెలియకుండానే ఏదో మనమొక్కరే ఇక్కడ తిష్ట వేసుకుని కూర్చునే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనతో ఉండే మనుషులను కూడా సమానముగా చూడక..ఏదో వీళ్ళు ఎక్కడి నుండో ఊడిపడినట్లుగా ఉంటారు. వీటన్నింటికీ కారణం కొంత మందిలో పాతుకుపోయి ఉన్న అహం అనే చెడు లక్షణం. ఈ లక్షణం వారిలో ఉన్నంత వరకు వీరు ఒకరిని గౌరవించలేరు. అలాగని వేరొకరి చేత వీరు గౌరవించబడరు. ఏదో వీరి జీవితం తూతూ మంత్రంగా సాగిపోతూ ఉంటుంది.
మీలోని మంచి మనిషిని అహం చేదుగా మార్చేస్తుంది. మీలో ఉండే మంచి లక్షణాలను తినేస్తుంది. అందుకే ఇలాంటి భయంకరమైన లక్షణం నుండి బయటపడాలి. అయితే మీకు అహం ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుందో ఇపుడు చూద్దాం.  
* అహం ఎక్కువగా ఉన్నవారు తోటి మనుషులకు విలువ ఇవ్వడం మానేసి, వారు వాడుతున్న వస్తువులకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. ప్రాణం ఉన్న మనిషికి మంచి చేస్తే, రేపు నీకు మంచి చేస్తాడు. అది వదిలేసి వస్తవులను ఎక్కువగా ప్రేమించడం ఏమిటి చెప్పండి. ఈ విదానానికి స్వస్తి పలకాలి.
* అంతే కాకుండా అహం ఎక్కువగా ఉన్న వారు పుకార్లు ఎక్కువగా వినడానికి మరియు వాటిని ఇతరులకు చెప్పడానికి ఇష్టపడుతుంటారు. ఎప్పుడూ అవతలి వారి గురించి ఆలోచనే తప్ప. వారి గురించి ఆలోచించుకోరు. ఈ చెడు అలవాటు నుండి బయటపడాలి.
* వీరికి పొగిడించుకోవడం ఎక్కువగా ఇష్టం. ఎప్పుడైతే మీరు పొగడ్తలకు అలవాటు పడుతారో మీలో అహం మరింత పెరిగిందనే అర్ధం.
 * ఒక ఇద్దరు మాట్లాడుకుంటుంటే వీరు కామ్ గా ఉండరు. వారి మాటలకు అంతరాయం కలిగిస్తూ ఉంటారు. ఈ అలవాటు ఉందా అహం వచ్చినట్లే.
* ఏదైనా ఒక కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు అందులో గెలవలేకపోతే మీరు దాన్ని లైట్ గా తీసుకోలేరు. అహం ఉన్నా వారే ఇలా ప్రవర్తిస్తారు.
* బయటకు వెళ్లి ఎవరితోనూ మాట్లాడకుండా, ఫ్రీగా లేకుండా మీకు మీరే సొంతంగా వ్యవహరిస్తూ ఉంటూ అలాంటి వారిలో అహం ఉన్నట్లే.
కాబట్టి మీరు ముందుగా ఈ లక్షణాలను గమనించి సరి చూసుకోండి. మీలో అహం ఉన్నట్లయితే మీరు తలపెట్టిన ఎటువంటి కార్యంలోనూ విజయం సాధించలేరు. కాబట్టి ఈ చిన్న లక్షణాన్ని మీ నుండి దూరం చేసుకుని విజయాన్ని సాధించండి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: