విజయం మీదే: ఈ 4 లక్షణాలు మీలో ఉన్నాయా... జర భద్రం ?

VAMSI
ఒక్కో సారి మీలో ఉన్న కొన్ని లక్షణాలే మీకు ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయి అనేది ఎవ్వరము చెప్పలేము. కాబట్టి మనము చేయాల్సిందల్లా ఒక్కటే ..వీలైనంతగా మన జీవితం గురించి పూర్తి జాగ్రత్త తీసుకోవడం. అంతకుమించి అంతా ఆ ఈశ్వరేచ్చ. అయితే మనలో ఉండే ఏ లక్షణాలు మనకు చెడును కలిగిస్తాయో ఒకసారి చూద్దాం.
* ముఖ్యంగా మన చుట్టూ ఉండే వారో లేదా మనమే కూడా కొన్ని సందర్భాలలో చాలా సున్నితంగా వ్యవహరిస్తూ ఉంటాము. కారణాలు ఏవి అయినా ఇది అంత మంచి పద్దతి కాదని చాలా మంది అంటున్నారు. గతంలో అయితే పరిస్థితులు వేరేగా ఉండేవి మీ సున్నితమైన మనస్తత్వానికి సూట్ అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఒకవేళ మీరు కనుక అమాయకంగా ముఖం పెట్టి సున్నితంగా ఎవరితో అయినా కొత్త వారితో మాట్లాడితే ఇక అంతే... మిమ్మల్ని క్షణాల్లో మోసం చేయగలరు.  అందుకే కాలానికి తగిన విధంగా మనము కూడా మారాలి. ఎవరితో అయినా గట్టిగా స్పష్టంగా మాట్లాడగలగాలి. అప్పుడే మనమంటే భయం భక్తి ఉంటుంది. లేదంటే మోసపోయే వారిలో మీరు కూడా ఒకరు కావడం పక్కా.
* కొంత మందిలో విపరీతమైన భావోద్వేగం ఉంటుంది. చిన్న విషయాలకు కూడా ఏదో జరిగిపోయినట్లు రియాక్ట్ అవుతారు. ఈ లక్షణం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే ఎదుటి వారు ఇలాంటి లక్షణంతో చూస్తే మీపై తొందరగా చెడు అభిప్రాయం కలిగే అవకాశం ఉంటుంది.
* కొన్ని పనుల్లో లేదా ఎక్కడికైనా వెళ్లే సమయాల్లో ఏదైనా పొరపాటు జరిగితే మిమ్మల్ని మీరే తిట్టుకోవడం అలవాటు ఉందా..? ఇది కనుక ఉంటే చాలా ప్రమాదం. ఏ పనిలోనూ అనుకున్న సమయంలో విజయాన్ని సాధించలేరు. కాబట్టి మిమ్మల్ని మీరు నిందించుకోకండి. కావాలంటే మీకు మీరు సపోర్ట్ చేసుకోండి, దైర్యం మీకు మీరే చెప్పుకోండి. ఇది ముందు ముందు మంచి ఫలితాలను అందిస్తుంది.
* కొంత మంది విమర్శలకు వణికిపోతుంటారు. అయితే ఈ విమర్శల్ని ఒక ఆశీర్వచనాలుగా తీసుకుని ఆ విమర్శలకే ఎదురెళ్తే మిమ్మల్ని ఆపేవారు ఎవ్వరూ ఉండరు.
పై లక్షణాలు మీలో ఉంటే మీకు ఇబ్బందులు తప్పవు కనుక జాగ్రత్త  వహించండి. వీలైనంత తొందరగా ఈ లక్షణాలను విడనాడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: