విజయం మీదే: మీలో మార్పు రావాలనుకుంటున్నారా ?

VAMSI
ప్రతి మనిషిలో తప్పొప్పులు ఉండడం సహజమే. జీవితంలో ఏదో ఒక పరిస్థితుల్లో మనిషి తప్పు చేస్తారు. అయితే తప్పులు చేసినంత మాత్రాన మనిషి ఫెయిల్ అయినట్లు కాదు. మళ్ళీ ఆ తప్పులు చేయకుండా జాగ్రత్తగా మసులుకుంటే విజయాన్ని సాధిస్తారు. ఇలాంటి తప్పుల నుండి ఒకేసారి బయటపడాలంటే అంత ఈజీ కాదు. ఒక్కసారిగా మనలో మార్పు రావాలంటే అంత కష్టం అయిన విషయం కూడా కాదు. దీని కోసం కొన్ని పనులను త్యాగం చేయాల్సి వస్తుంది. అయితే ఒకసారి చూద్దాం ఏ పనులను మీరు వదులుకోవాల్సి వస్తుందో.
* నేడు మారుతున్న సమాజములో సోషల్ మీడియా అనేది మనిషిపై ఎంతో ప్రభావాన్ని చూపుతోంది. ఈ సోషల్ మీడియా వాడకానికి దూరంగా ఉండడమే మంచిదని మానసిక నిపుణులు సలహా ఇస్తున్నారు. అందరూ వాడుతున్నారు కానీ కొంతమంది అదే జీవితంలాగా దానికి అలవాటు పడిపోతున్నారు. అందుకే దీనిని త్యజించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
* మనిషి జ్ఞానానికి ముఖ్యకారకాలైన పుస్తకాలతో ఎక్కువ సమయం గడపాలని చెబుతున్నారు.
* మాములుగా చాలా మంది నిత్యం వారి భవిష్యత్తు కోసం కలలు కంటూ ఉంటారు. ఉదాహరణకు: నేను అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అలా అవ్వాలి...అని రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. కానీ ఆ కలలను సాకారం చేసుకునే దిశగా ఏ మాత్రం ప్రయత్నించరు. వారు ఈ రోజు నుండి వారి కలల కోసం పోరాడాలి.
* మీలో మార్పు రావాలంటే, మీపై మీరు ద్వేషం పెంచుకోకూడదు. ప్రేమను పెంచుకోవాలి. అప్పుడే మీలో మార్పు రావడానికి సులభతరం అవుతుంది.
* ఎప్పుడూ పని అవలేదని నిరాశతో ఉండకండి.
* ముఖ్యంగా మిమ్మల్ని వేరే వారితో పోల్చుకోవడం మానేయండి. మీలో మార్పు వస్తోందా లేదా చూసుకోండి.
* మీ పక్కవారిలో తప్పులను వెతకడం మానేయండి. వారు తప్పులు చేస్తే సున్నితంగా తెలియచేసి, మంచి చేసేలా ప్రోత్సహించండి.
* జీవితంలో ఎప్పుడూ కూడా పగ ప్రతీకారం అనేది పెట్టుకోకండి. అందరితో సామరస్యంగా మెలగండి.
* అవతలి వారు చెప్పే విషయాలలో మీకు సందేహాలు ఉంటే వెంటనే చెప్పేయండి. మొహమాటపడకండి.
మీలో నిజమయిన మార్పు కనిపించాలంటే వీటిని పాటించండి. తరువాత చూడండి మార్పు జెట్ స్పీడ్ లా దూసుకొస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: