విజయం మీదే: పేదైనా... గొప్పైనా అంతా ఒక్కటే ?

VAMSI
ప్రతి మనిషికి తమ తమ నిత్య జీవితంలో ఎన్నో సుఖ దుఃఖాలు ఎదురవుతుంటాయి. ఇది ప్రతి మనిషి జీవితంలో జరిగేదే. ఏ చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎంత సంపన్నులైన సరే వారికి తగ్గ బాధలు వారికి ఉండనే ఉంటాయి. అయితే చాలా మంది సాధారణంగా ఏమని భావిస్తారు అంటే పేద వారికి మాత్రమే కష్టాలు ఉంటాయి అని, వారి జీవితంలో సుఖాలకు అస్సలు చోటే ఉండదని అని అనుకుంటుంటారు. కేవలం ఆర్థికంగా బాగా ఉన్న వారు మాత్రమే ఆనందంగా ఉంటారని అనుకుంటుంటారు. కానీ సుఖ సంతోషాలు అనేవి కొద్దో గొప్పో కాస్త డబ్బుతో ముడిపడి ఉంటాయేమో గానీ, పూర్తిగా అయితే డబ్బుతో కొనగలిగేవి కాదు. ఎవరికి ఏవీ ఎప్పటికీ సొంతం కావు.
మన జీవితంలో సంతోషం ఎంత వరకు అనేది మనపైనే ఆధారపడి ఉంటుంది. జీవితం అన్న తర్వాత కొన్ని చికాకులు, చిన్న చిన్న అసంతృప్తిని కలిగించే విషయాలు జరగడం సర్వ సాధారణం. అలాగని ప్రతి చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి చూస్తే అది పెను ప్రమాదం లాగానే కనిపిస్తుంది. పెద్ద విపత్తు లాగానే చుట్టేస్తుంది. ధనవంతులైనా, పేదవారయినా సరే సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి కానీ, వాటిని చూసి భయపడి పారిపోకూడదు, కుంగిపోకూడదు. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తే కొండంత సమస్య అయినా గోరంతగా మారి కరిగిపోతుంది.
అలా కాకుండా భయపడి ఆందోళన చెందితే పిల్ల కాలువ లాంటి సమస్య అయినా సరే బయటపడలేనంత మహాసముద్రంలా కనిపిస్తుంది. కాబట్టి ధనవంతులైనా, పెదవారైనా  సమస్య వస్తే ఎదుర్కొని ముందుకు సాగాలి.  ధైర్యంతో  సమస్యలను అధిగమించి సంతోషాన్ని అందుకోవాలి. అప్పుడే మన జీవితం మనకు నచ్చిన విధంగా మారుతుంది. మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ లక్షణాలను కలిగి ఉంటేనే మీరెప్పుడూ సంతోషంగా ఉండగలరు. ఈ కష్టాలు ఎవ్వరినీ విడిచి పెట్టవు. అటు పేదవారిని టీయూ గొప్పవారిని సైతం. అయితే వాటిని ఎదుర్కొనే వారిలో సత్తా ఉండాలి. అదే ప్రధానం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: