విజయం మీదే: ఆత్మవిశ్వాసమే... మీ లక్ష్యానికి ఆయుధం ?

VAMSI
జీవితమనే చదరంగంలో ఓటమి గెలుపులనేవి పూర్తిగా మన పనితనం పైనే ఆధారపడి ఉంటాయి. మన ఆలోచనా విధానం, ప్రతిభ, మనస్తత్వం, సామర్ధ్యత అనుభవం, పట్టుదల ఇలా అన్ని విషయాలు మన విజయాన్ని నిర్దేశిస్తాయి. ప్రధానంగా ఆత్మ విశ్వాసం అనేది ఇక్కడ ఎంతో అవసరం. అదే విధంగా మన గమ్యంపై ఏకాగ్రత , దూరదృష్టి ఉండటం కూడా ఎంతో ముఖ్యం. ఏకాగ్రత వలన మన లక్ష్యంపై మనకు సరైన గురి ఉంటుంది, విజయాన్ని అందుకోవడానికి సరైన మార్గాన్ని ఎంచుకోవడంలో ఏకాగ్రత ఎంతగానో సహాయపడుతుంది. మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం వలన ఏకాగ్రత అనేది పెరుగుతుంది. తద్వారా మన ఆలోచన విధానం విజయం వైపు అడుగులు వేసేలా చేస్తుంది. మనము వేసే ప్రతి అడుగు ఎంతో ఆలోచించి వేయాలి.
ప్రతి ఆలోచన దూరదృష్టిని కలిగి ఉండాలి. అప్పుడే మన నిర్ణయం సరైందిగా ఉంటుంది. అలాగని మన తొలి ప్రయత్నంలోనే విజయం సొంతం అయిపోవాలి అంటే అంత సులభం కాదు. అలాగని ఓటమి ఎదురైంది అని నిరాశ పడిపోయి కుంగి పోకూడదు. జీవితంలో గెలుపోటములు సహజం. మొదటి ప్రయత్నంలోనే గెలుపు ఖచ్చితంగా దక్కాలి అంటే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఓటమి ఎదురైనప్పటికి అనుకున్న లక్ష్యాన్ని అందుకోవడం కోసం తిరిగి మరల మరల ప్రయత్నిస్తూ ఉంటేనే వారిని ఏదో ఒక రోజు ఖచ్చితంగా విజయం వరిస్తుంది. మన లక్ష్యంపై ఉన్న ఏకాగ్రతే మనల్ని విజయం చెంతకు చేరుస్తుంది.
అందుకే ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి పూర్తి ఏకాగ్రతతో దానిపై పూర్తి దృష్టిని ఉంచి కృషి చేస్తే విజయం తప్పక మీ సొంతం అవుతుంది. మనం ఏ పనిని సాధించాలన్నా సరే అందుకు ఏకాగ్రత అవసరం. ఏకాగ్రత ఉండుట వలన ఆ పని సులభం గానూ మరియు త్వరగానూ పూర్తవుతుంది. ఇలా పై విషయాలన్నీ సక్రమంగా పాటిస్తే విజయం మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్ళదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: