విజయం మీదే: ఇలా చేస్తే .. శత్రువైనా నీ మిత్రుడే ?

VAMSI
సాధారణంగా జీవితంలో మనకు తెలియకుండానే ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. అవి మన జీవితాన్ని ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో మనకు కొత్తగా శత్రువులు ఏర్పడవచ్చు, మన స్నేహితులే శత్రువులుగా మారవచ్చు లేదా కొని సందర్భాల్లో మనకు మనమే శత్రువు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఈ శత్రుత్వం కారణంగా ఎదుటి వారికి అలాగే మనకు తెలియని అసహనం మరియు అశాంతి ఏర్పడుతుంది. తద్వారా మనం చేసే పనులపై దృష్టి వెళ్ళదు. అయితే మానవులందరూ తెలుసుకోవాలిసిన విషయం ఏమిటంటే, శత్రుత్వం పెట్టుకోవడం వలన మనకు ప్రయోజనం ఏమీ ఉండదు. ఇంకా దాని కారణంగా బోలెడు నష్టాలు మరియు కష్టాలు తప్ప. ఇటువంటి శత్రుత్వానికి స్వస్తి చెప్పి సంతోష జీవితానికి స్వాగతం చెప్పాలంటే మనలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. అవేమిటో ఒకసారి చూద్దాం.
 ప్రతి ఒక్కరికీ కోపం ఉండడం సహజం. అయితే  అది చాలా అనర్దాలకు దాసరి తీస్తుంది. వీలైనంతగా తగ్గించుకోవడానికి ప్రయత్నించడం చాలా మంచిది. ఇది మీ శత్రువు మిమ్మల్ని ఏదైనా తిట్టినా కోపం రాకూడదు. ఇక్కడే మీరు సగం సక్సెస్ అవుతారు. ఎవ్వరైనా మనల్ని ఊరికే తిడుతుంటే లేదా గొడవకు లాగుతుంటే మనము ప్రశాంతంగా ఉంటే వారు ఎక్కువసేపు అరవలేరు, గొడవ పడలేరు. తద్వారా మారే దానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మరియు శత్రువు అయినా సరే ప్రేమించగలగాలి, వాళ్ళు మీ మీద కోప్పడినా కూడా లైట్ తీసుకుని, వారితో మాట్లాడడానికి ట్రై చేయాలి. ఇలా చేయక ఇగో లకు పోయి ప్రపంచంలో ఎంతోమంది భార్యాభర్తలు, తల్లి తండ్రులు, మిత్రులు విడిపోయి ఉంటారు. కానీ ఒక్క క్షణం ఇగోని పక్కన పెట్టేసి వెళ్లి మాట్లాడితే వారు కూడా మిమ్మల్ని అర్ధం చేసుకుని కలిసిపోతారు.
శత్రువును అయినా కరిగించే గుణం ఒక్క ప్రేమలోనే ఉంటుంది. మీరు వారిని చూసే విధానం వారికి అర్థమయ్యేలా చేయగలిగితే మీకు ఫ్రెండ్ గా మారిపోతారు. ముఖ్యంగా మీరు ఎప్పుడూ ఇవ్వగలిగే స్థానంలో ఉండాలి అది ప్రేమైనా ఇంకేమైనా, అప్పుడే అవతలి వారికి మీ విలువ అర్ధమవుతుంది. చిన్ని చిన్ని ఆనందాలకు స్వార్ధానికి పోయి మీతో ఉన్న బంధాలను అనుబంధాలను శత్రుత్వంగా మార్చుకోకండి. వీలైతే ప్రేమించండి ...పోయేదేమీ ఉండదు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: