విజయం మీదే: జీవితంలో సంపద కన్నా ఇదే ముఖ్యం ?

VAMSI
ఒక మనిషి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవించడానికి కొన్ని అవసరం. అటువంటి వాటిలో జ్ఞానం కలిగి ఉండడం చాలా ముఖ్యం. జ్ఞానం అనగానే అందరూ తెలివితేటలు అని అనుకుంటారు. కానీ జ్ఞానం అనేది మనం తెలివితేటలతో లేదా ప్రతిభకు మాత్రమే సంబంధించినది కాదు. జ్ఞానం అంటే తెలుసుకోవడం. దేని గురించి అయినా స్పృహను పొందడం. నిజమైన జ్ఞానం అనగా ఆత్మానాత్మ వివేకం. వివేకం అనగా తెలివితేటలు మరియు క్షుణ్నంగా తెలుసుకోవడం. అవగాహన పొందటం. జ్ఞానం అనేది వాస్తవికతను గూర్చిన అభిప్రాయాలు, భావాలు, ప్రతిపాదనల సముదాయం అని చెప్పవచ్చు. అంటే భౌతిక వాస్తవికతను, సత్యాన్ని ప్రతిబింబించేదిగా ఉన్నటటువంటి భావాలను జ్ఞానమంటారు.
సంపద కంటే జ్ఞానము ఉత్తమమైనది. ఎందుకనగా సంపదను మీరు రక్షించాల్సి వస్తుంది. కానీ జ్ఞానం మాత్రం మిమ్మల్ని రక్షిస్తుంది. జ్ఞాన సాధన అనునది  అవాస్తవిక భావాల వలన కలిగే అజ్ఞానాన్ని వాస్తవిక భావాల ద్వారా తొలగించడం. దీన్ని జ్ఞానంగా పరిగణించవచ్చు. ఉదాహరణకు చాలామంది మూఢనమ్మకాలను ఆచరిస్తూ ఉంటారు. అయితే జ్ఞానం ఉన్న వారు వాటిని నమ్మరు ఆచరించరు, తద్వారా ఏ చెడు ఆలోచనల వలలో పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. దీనికి కారణం జ్ఞానమే అవుతుంది. జ్ఞాన నిర్మాణానికి తొలిమెట్టు అనుభూతులను అలవర్చుకోవడం అవుతుంది. ఏది వాస్తవం ఏది అవాస్తవం అని సరి పోల్చగల అవగాహన మీకు ఉండాలి. ప్రతి ఒక పిల్లవాడి సరైన జ్ఞాన నిర్మాణానికి తల్లిదండ్రులు, విద్య బోధించే గురువులు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు.

అందుకే మీరు వారికి చెప్పే ప్రతి మాట, నేర్పించే ప్రతి అంశం వాస్తవమై ఉండాలి అదే విధంగా అది వారికి ఉపయోగపడేలా ఉండాలి. అప్పుడే పిల్లల జ్ఞాన నిర్మాణం పటిష్టంగా మారి వారి బంగారు భవిష్యత్తుకు మార్గం ఏర్పరుస్తుంది. ఈ మార్గంలో ఎన్ని సమస్యలు ఎదురైనా అదే జ్ఞానం వారికి ఆత్మ స్థైర్యాన్ని పెంచి లక్ష్యం వైపు నడిపిస్తుంది. అదే మీకు ఎంత సంపద ఉన్నా జ్ఞానం లేకుంటే దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియదు. అలాంటప్పుడు మీకు ఎంత సంపద ఉంది లాభం ఏమిటి. కాబట్టి మీ జీవితకాలంలో సంపద కన్నా  జ్ఞానాన్ని సంపాదించుకోవడంపై దృష్టి సారించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: