10 నిమిషాల్లో 34 బర్గర్లు లాగించారు..?

MOHAN BABU
ఒక్కొక్కరికి ఒక్కో కల ఉంటుంది. ఏదో రకంగా వాళ్లు రికార్డులు బ్రేక్ చేస్తుంటారు. ఒకరు జుట్టుతో  లారీని లాగడం. ఒక గోర్లు పెంచుకోవడం. ఇలా రకరకాల వెరైటీలతో తమలో ఉన్న  టాలెంట్ ను  చూపిస్తూ రికార్డులు బ్రేక్ చేస్తూ ఉంటారు. అలాంటి రికార్డే వీరు ఫుడ్ తిని విజేతలుగా నిలిచారు.  తినడం అంటే రోజువారి తినే ఫుడ్ కాకుండా కాస్త వెరైటీగా ఉండే ఫుడ్డు తిన్నారు. ఫుడ్ లవర్స్ రోజు వారు ఏదో ఒక వెరైటీ గా ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. అదే వారికి ప్రస్తుతం పోటీగా మారింది. ఈ ఫుడ్ లవర్స్ కోసం ఫుడ్ ఈటింగ్ కాంపిటీషన్ పెట్టారు.
 ఇందులో ఫుడ్ ఈటర్స్ అంతా  కుంభకర్ణునిలా కుంభాల, కుంభాలు పుడ్డును తినేస్తుంటారు. వారికంటూ  ఒక టైమ్ లిమిట్ ఉంటుంది. ఆ నిర్ణీత  సమయంలోనే పుడ్ అంత ఖాళీ చేసి రికార్డులు బద్దలు కొట్టారు. వీరంతా ప్రత్యేకంగా ఫుడ్ ఫెస్టివల్స్ లోనూ, ఫుడ్ కాంటెస్ట్ లోనూ పాల్గొంటూ ఉంటారు. ఈ సందర్భంలోనే వాషింగ్టన్ నగరంలో ప్రతి సంవత్సరం జూలై 2వ తేదీన  జరిపే  బర్గర్ ఈటింగ్ ఆటల్లో ఈసారి ఇద్దరు విజేతలుగా  విజయం సాధించారు. వాషింగ్టన్లోని  ఫాస్ట్ ఫుడ్ చైన్ బర్గర్ అనే సంస్థ నిర్వహించినటువంటి మ్యాన్యువల్ ఇండిపెండెన్స్ బర్గర్ ఈటింగ్ పోటీలో అమెరికాకు చెందినటువంటి 14 మంది ఫుడ్ ఈటర్స్ పాల్గొన్నారు. అలాగే వాషింగ్టన్లోని కొంతమంది పాల్గొన్నారు.
 ఈ క్రమంలోనే  కాలిఫోర్నియా నగరానికి చెందిన మాల్ షులార్ 10 నిమిషాలలో 34 బర్గర్లు పట్టుమని తినేసి అద్భుతాన్ని సృష్టించాడు. అయితే ఈమెతో పాటు పెన్సిల్వేనియాకు చెందినటువంటి ఈటర్ అమేది కూడా  34 బర్గర్లు  తిన్నాడు. ఇద్దరు సమానంగా ఒకే సమయంలో  రికార్డు కొట్టాడు.  దీంతో ఈ యొక్క టోర్ని టైగా నిలిచింది. అయితే ఇద్దరిని విజేతలుగా నిలిపి బహుమానంగా  4350 డాలర్ల ప్రైజ్ మనీ అందించి, ట్రోఫీతో సత్కరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: