విజయం మీదే: నీ బలం ఏమిటో తెలుసుకో ... ?

VAMSI

ప్రతి ఒక్కరూ తమ జీవితం ఎంతో ఆనందంగా, మరియు అన్ని పనులు సవ్యంగా జరగాలని అనుకుంటారు. అందుకు తగ్గట్టుగా తమ చుట్టూ ఉన్నవారు కూడా వారిని ప్రోత్సహించాలని ఆశపడతారు. కానీ పరిస్థితి ఎప్పుడూ మన చేతుల్లో ఒకేలా ఉండవు. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఈ రోజు నీవు మొదటి మెట్టుపై ఉండవచ్చు, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరవచ్చు. అదే విధంగా కొందరు ఎంతో ఉన్నతమైన స్థాయిలో నుండి అదఃపాతాళానికి పడిపోవచ్చు, ఏదీ మన చేతిలో ఉండదు. దీనికి పలు రకాల చర్యలు కారణమవ్వచ్చు. అలాగని మన చుట్టూ ఉన్న వారిని నిందించరాదు, మనల్ని మనం కోల్పోరాదు. తప్పు ఎక్కడ ఉంది ? మనలో ఉన్న లోపం ఏమిటి అన్న విషయాన్ని గ్రహించగలగాలి. అప్పుడే అనుకున్న స్థాయికి చేరుకోగలం.
మీరు ఫెయిల్ అయినప్పుడు కోపం, మంచి స్థాయిలో ఉన్నప్పుడు అహంకారం రెండూ ప్రమాదమే. ఇవే మన నిజమైన శత్రువులు. ముందు  నిన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకోవాలి. మీ బలం-బలహీనత గుర్తించగలగాలి. అప్పుడే అనుకున్నది సాధించగలరు. పరిస్థితులు ఎలా ఉన్నా ఎదుటి వారితో స్నేహంగా మెలగాలి. మన పరిస్థితి ఎదుటి వారిని నిందించి దూషించరాదు. వారెందుకు అంత ఉన్నత స్థాయిలో ఉన్నారు. నేనెందుకు ఇక్కడే ఆగిపోయాను, నా జీవితం ఎందుకు ఇలా అగమ్యగోచరంగా మారింది. అనుకుంటూ జుగుప్సకు లోను కాకూడదు. మీ సామర్ద్యం ఎంత అన్న విషయం గుర్తించగలగాలి అందుకు తగ్గట్టుగా నడుచుకోవాలి.
మనల్ని మనం ప్రేమించాలి, గౌరవించాలి. మనతో మనకు శాంతిగా లేకపోతే ప్రపంచంలో శాంతిని సాధించగలమని ఆశించలేము. ముందుగా మనల్ని మనం నమ్మాలి. మన  సామర్థ్యానికి మించి ప్రయత్నించాలి. ఫలితం ఏదైనా సంతోషంగా స్వీకరించగలగాలి. అప్పుడే మనకు ప్రశాంతత లభిస్తుంది. లేని వాటి గురించి బాధపడుతూ ఉన్న వాటిని దూరం చేసుకోకుండా సంతోషంగా జీవించడం నేర్చుకోవాలి. అంతర్గత శాంతి ద్వారా మీరు దేనినైనా సాధించవచ్చు. ఇక్కడ వ్యక్తిగత బాధ్యత చాలా స్పష్టంగా ఉంది, ఎందుకంటే శాంతి వాతావరణం తనలోనే సృష్టించబడాలి, అప్పుడు అది గమ్యానికి మలచి సమాజంలో గౌరవించ పడేలా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: