
విజయం మీదే: మీ ఫెయిల్యూర్ కి మీరే కారణం ... ?
మీరు విద్యార్థి అయితే కొన్ని అలవాట్లు తప్పకుండా మానుకోవాలి. ముఖ్యంగా విద్యార్థిగా ఉన్న వారు టీవీ చూడడం తప్పక మానుకోవాలి. సాధారణంగా ధనవంతులు అయిన విద్యావంతులు ఎప్పుడైనా మేము టీవీ చూస్తూ సమయం గడుపుతూ ఉంటామని చెప్పడం మీరు విన్నారా. ఎందుకంటే వారు టీవీ చూస్తూ వారి సమయాన్ని వృధా చేసుకోరు. ఎందుకంటే వారు విలువైన సమయాన్ని టీవీ చూస్తూ వృధా చేసుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి సమయానికి ఉన్న విలువను తెలుసుకో. మనలో చాలా మంది అనవసర వస్తువులు కొనుగోలు చేయడానికి చాలా డబ్బును వృధా చేయడం జరుగుతుంది.
ఇతరులకు గొప్పగా చూపించుకోవడానికి వారి వద్ద ఉన్న ధనాన్ని మొత్తం అవసరం లేని వస్తువులపై ఖర్చు చేస్తారు. అందువలన వారు అవసరమైనప్పుడు డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతారు. అదే ధనవంతులైన వారిని చాలావరకు గమనిస్తూ ఉండండి, వారు అవసరమైన వస్తువుల పైన వారి ధనాన్ని ఖర్చు చేయడం జరుగుతుంది అభివృద్ధి చెందాలంటే ఎప్పుడైనా సరే వృధా ఖర్చులు అనేవి చేయకూడదు. ఇలా మీరు డబ్బు యొక్క విలువను తెలుసుకోవాలి. మన జీవితంలో ఎప్పుడైనా డబ్బును మనం గౌరవిస్తే, అదే మనల్ని కష్ట కాలంలో మన గౌరవాన్ని నిలబెడుతుంది.