విజయం మీదే: కలలు కనడం కాదు వాటి కోసం పరుగు తీయండి...?

VAMSI
మనిషి అన్నాక మనసులో చాలా కళలు ఉంటాయి. కానీ పొద్దున్నే నిద్ర లేవడానికి మాత్రం ధైర్యం లేదు ఏదో ఒకటి సాధించాలని మనసులో కోరిక చాలా బలంగా ఉంటుంది. అంతే కాకుండా ప్రపంచాన్ని గుప్పెట్లోకి తెచ్చుకోవాలనే ఆరాటం ఉంటుంది. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ కళలన్నీ నిజమవుతాయా దుప్పటి కప్పుకొని పడుకొని కలలు కంటూ ఉంటే అవి నిజమవుతాయా ? ఎవరో చెప్పే మోటివేషనల్ కథలు చదివినంత మాత్రాన మన జీవితంలో మార్పు వస్తుందా ? అయితే మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. ఈ మోటివేషన్ కథలు వలన మీకు జీవితంలో ఎదగడానికి ఒక చలనాన్ని కలింగించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఆ తర్వాత మీ కాళ్ల మీద మీరు నిలబడాలి ముందుకు సాగి వెళ్ళిపోతూ ఉండాలి.
కేవలం బండిలో పెట్రోల్ ఉన్నంత మాత్రాన దానికదే నడవదు ఆ బండిని నడపాల్సిన బాధ్యత మీపై ఉంటుంది.  సిలిండర్లు గ్యాస్ ఉన్నంత మాత్రాన భోజనం దానికదే తయారు అవ్వదు మనం వంట చేయవలసి వస్తుంది. ఇలానే పడుకుని కలలు కంటూనే ఉంటే ఆఖరికి సోమరి లాగానే మిగిలిపోతావు నిజంగా నువ్వు జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనుకుంటున్నావా అయితే లే కాలంతో సమానంగా పరిగెత్తు నీ గుండెల్లో మంటను వెలిగించు. ఈ మంట నీ జీవితంలో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది మరియు నీతో పాటు ఎంతో మందికి వెలుగునిస్తుంది. ఇలా ఇంకా ఎన్ని రోజులు ఆలోచిస్తూనే ఉంటావు.  రేపు చూద్దాం రేపు చేద్దాం అంటూ రేపటి నుండి చేయాలి రేపటి నుండి మారాలి అనే ఆలోచన నీ మనసులో నుండి తీసేయాలి. ఎందుకంటే రేపటికి రూపం లేదు నువ్వు ఏం చేయాలనుకుంటున్నారో అది ఈ రోజే సాధించు. ఏమీ చేయకుండా ఉంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. ఇసుమంత కూడా మార్పు అనేది మన జీవితంలో కనిపించదు.
 మనందరికీ తెలుసు కానీ మనం మారడానికి ఇష్టపడం ప్రపంచాన్ని గెలవాలనే కలలు కంటూనే ఉంటాం మనం ఆ కలలకు మనం కార్యరూపం ఇచ్చిన అప్పుడు మాత్రమే మనం ఆ కలలను సాకారం చేసుకోవచ్చు. కేవలం మనం చెప్పినంత మాత్రాన మన కలలు నిజం కావు. దానికోసం కఠోర శ్రమ చేయాల్సి ఉంటుంది,. కష్టపడాల్సి ఉంటుంది. ఎన్నో సంఘర్షణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి మీరు పడుకుని కలలు కన్న అంతమాత్రాన ఆ కలలు నిజం అయ్యే ప్రసక్తే లేదు నీ కలలు కలలాగానే మిగిలిపోతాయి. మీరు మీ జీవితంలో ఏం సాధించాలి అనుకుంటున్నారో అది ఎప్పటికీ సాధించలేరు. వీలైనంత త్వరగా నీ జీవితంలో ఉన్న ఏ టార్గెట్ నైనా వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. నీ జీవితాన్ని ఆస్వాదించండి. మనం పుట్టింది కేవలం నిద్ర పోవడానికి మాత్రమే కాదు ప్రతి వ్యక్తి ఏదో ఒకటి సాధించడానికి పుట్టాడు ఈ విషయం గుర్తు పెట్టుకో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: