టైమ్ మేగజైన్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్'గా బైడెన్, కమలా హ్యారిస్ !

SS Marvels
ఇటీవలే జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ మరియు వైస్-ప్రెసిడెంట్ అభ్యర్థి కమలా హ్యారిస్‌లను ఈ ఏడాది టైమ్ మ్యాగజైన్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ గా జాబితాలో  చోటు కల్పించింది. ఈ డెమొక్రటిక్ నేతలు ఇద్దరూ మరో ముగ్గురు ఫైనలిస్టులను వెనక్కి నెట్టేసి మరీ ఈ జాబితాలో చోటు సంపాదించారు. కోవిడ్-19 మహమ్మారిపై ముందుండి పోరాటం చేస్తున్న ఆరోగ్య సంరక్షణ కార్మికులు- ఆంథోనీ ఫౌచీ, డొనాల్డ్ ట్రంప్, జాత్యహంకార ఉద్యమం కూడా ఈ జాబితాలో పోటీపడిన వ్యక్తులు, అంశాలు. ఇక 78 ఏళ్ల బైడెన్, 56 ఏళ్ల కమలా హ్యారిస్‌ల ఫోటోలను కవర్ పేజ్‌పై ముద్రించిన టైమ్ మ్యాగజైన్.. ‘అమెరికా కథను మార్చారు’ అనే ఉప-శీర్షికను పెట్టింది. ఈ అవార్డు 2016లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను వరించింది. ఇక ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు మొత్తం 306 ఎలక్టోరల్ ఓట్లు రాగా.. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు 232 ఓట్లు వచ్చాయి. అలాగే, అమెరికా ఎన్నికల్లో ఇప్పటి వరకూ ఎవరికి సాధ్యం కాని రీతిలో బైడెన్ 70 మిలియన్లకుపైగా ఓట్లను సాధించారు. ఇప్పటి వరకు 2006 ఎన్నికల్లో బరాక్ ఒబామా సాధించిన 6.9 మిలియన్ ఓట్లే అత్యధికం కాగా.. దానిని జో బైడెన్ అధిగమించి రికార్డు నెలకొల్పారు.

టైమ్ మ్యాగజైన్ 1927 నుంచి ప్రతి ఏటా ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందజేస్తోంది. ఈ ఏడాదిలో వార్తల్లో నిలిచిన వ్యక్తులు, ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేసినవారిని అవార్డుతో సత్కరిస్తుంది. ఈ ఏడాది ‘అథ్లెట్ ఆఫ్ ది ఇయర్‌’గా ప్రముఖ బాస్కెట్‌బాల్ ఆటగాడు లెబ్రాన్ జేమ్స్‌ను ఎంపిక చేసింది. 35 ఏళ్ల జేమ్స్.. నాలుగుసార్లు ఎన్‌బీఏ టైటిల్‌ను గెలుచుకున్నారు. నల్లజాతీయుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా పోరాడినందుకు టైమ్ సంస్థ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేసింది. ఎంటర్‌టెయినర్ ఆఫ్ ది ఇయర్‌గా కే-పాప్ గాయకుడు బీటీఎస్‌ను ఎంపికచేసింది. గత ఏడాది టైమ్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్‌'గా వాతావరణ కాలుష్యంపై జరుగుతోన్న పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న టీనేజర్ గ్రెటా థన్‌బెర్గ్‌ను ఎంపికచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: