మీ లక్ష్యం చేరువకావడానికి అవరోధాలు ఎదురవుతున్నాయా...?
అయితే మీరు అనుకుంటున్నట్లుగా లక్ష్యసాధన అనేది అంత సులువైన విషయం కాదు.. ఇందులో ఎన్నో అవరోధాలను అధిగమించాల్సి ఉంటుంది. ఇందులో అనుకూల వాతావరణం లేకపోవడం, ప్రతికూల పరిస్థితులే లక్ష్య సాధనకు ప్రాథమిక అవరోధాలుగా కనిపిస్తూ ఉంటాయి. మనము మాత్రం ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటికి లొంగి పోకూడదు మరియు కుంగి పోకూడదు. ఆత్మవిశ్వాసంతో అవరోధాలపై ఆధిపత్యం సాధించ గలిగితే విజయం మనవెంటే ఉంటుంది. విజయం కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుకు సాగాలి.లక్ష్య సాధనలో ఎదురయ్యే అవరోధాలను సాదరంగా ఆహ్వానించాలి. ప్రతికూల పరిస్థితులు లేదా అవరోధాలు ఎదురవుతాయన్న భయం ఏమాత్రం మనలో ఉండ కూడదు. వాటికి ఎదుర్కొనడానికి మన శక్తి మేరకు ప్రయత్నించాలి. తద్వారా ఎదురయ్యే అవరోధాలపై విజయం సాధించడం మరింత సులభ తరం అవుతుంది.
అంతేకాకుండా మనకు ఒక అవరోధం తొలగి పోగానే పొంగి పోకూడదు.. ముందు ముందు మరిన్ని అవరోధాలు లక్ష్యసాధనకు ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉంటాయని గ్రహించాలి. వాటిని కూడా సానుకూల ధోరణితోనే అధిగమించగలగాలి. అప్పుడే విజయం సొంతమవుతుంది. ఒక్కో అవరోధాన్ని సమర్థనీయంగా అధిగమించుకుంటూ పోతే విజయం నల్లేరు మీద నడకే అవుతుందనడంలో సందేహం లేదు. పై విషయాలను నిశితంగా అర్ధం చేసుకున్న తరువాత మీ సాధనను మొదలుపెట్టండి జీవితంలో మీకింకా తిరుగే ఉండదు.