విజయం మీదే : క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తే విజయం మీ సొంతం

Reddy P Rajasekhar

జీవితంలో ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే తప్పనిసరిగా క్రమశిక్షణను, సమయపాలనను అలవరచుకోవాలి. ప్రతి వ్యక్తి తనపై తనకు స్వీయ నియంత్రణను, స్థితి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. సమయపాలన పాటిస్తూ క్రమశిక్షణతో పనులు చేస్తే ఏ పనిలోనైనా విజయం సాధించటం కష్టమేమీ కాదు. క్రమశిక్షణను, సమయపాలనను ఆచరించటం వలన కన్న కలలను సొంతం చేసుకోవటం సులువవుతుంది. 
 
ప్రతి వ్యక్తి తనంతకు తాను క్రమశిక్షణను అలవరచుకోవాలి. చక్కటి క్రమశిక్షణతోనే మన ప్రగతికి పునాదులు పడతాయని గుర్తుంచుకోవాలి. చాలామంది తమకు తెలీకుండానే సమయం వృథా అవుతుందని ఎన్నో సందర్భాలలో చెబుతూ ఉంటారు. జీవితంలో ఎలాంటి లక్ష్యాలను సాధించాలన్నా సమయపాలన గురించి పూర్తి అవగాహన అవసరం. సమయాన్ని అనుసరించి ఒక ప్రణాళిక రూపొందించుకుంటే ఆ ప్రణాళికను తప్పనిసరిగా అనుసరించాలి. 
 
మన సమయం ఎవరివలనైనా, ఏ విషయాలవలనైనా వృథా అవుతుందని భావిస్తే వీలైనంతవరకు వారికి/వాటికి దూరంగా ఉండటం మంచిది. ప్రతిసారి మనం అనుకున్న సమయం కంటే ఎక్కువ సమయం చేయాల్సిన పనికి పడుతూ ఉందంటే ఎక్కువ సమయాన్ని కలుపుకొని ప్రణాళిక రూపొందించుకోవటం మంచిది. పనులను ఎప్పుడూ వాయిదా వేయకూడదు. పనులను ఒక్కసారి వాయిదా వేయడం మొదలుపెడితే ఆ పని ఆ తరువాత కూడా వాయిదా పడుతూనే ఉంటుంది. అందువలన వీలైనంతవరకు పనులను వాయిదా వేయకుండా ఉండటమే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: