అతి త్వరలోనే మరో భారీ వినాశనం రాబోతుందా..? హింట్ ఇస్తున్న ప్రకృతి..!

Thota Jaya Madhuri
త్వరలోనే అతి భారీ వినాశనం రాబోతుందా..?? ప్రపంచం మొత్తం అంతరించిపోతుందా ..?? మనుషులందరూ చచ్చిపోబోతున్నారా..? భూమి మీద ప్రాణం ఉన్న జీవి ఒక్కటి కూడా మిగలదా..? ఇలాంటి విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఈ మధ్యకాలంలో యుగాంతం రాబోతుంది అని ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోతుంది అని భారీ వినాశనం ఎదుర్కోవాలి ప్రజలు అని రకరకాలుగా వార్తలు వినిపించాయి . దానికి తగ్గట్టే జులై 5వ తేదీ జపాన్ లో భారీ సునామీ రాబోతుంది అని ఆ కారణంగా జపన్  దేశమే మ్యాప్లో లేకుండా పోతుంది అంటూ కొంతమంది ఓపెన్ గాని చెంప్పుకు వచ్చిన విషయాలు మనకు తెలిసిందే.



అయితే ఇలాంటి మూమెంట్లోనే సోషల్ మీడియాలో మరొక వార్త వైరల్ గా మారింది . ప్రేమికుల చిహ్నంగా చెప్పుకునే తాజ్ మహల్ డేంజర్ జోన్ లో ఉంది అని .. ఆ కారణంగా ప్రపంచం వినాశనానికి ఇది ఒక సిగ్నల్ అని సోషల్ మీడియాలో కొంతమంది తెగ వార్తలు వైరల్ చేస్తున్నారు.  యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన తాజ్ మహల్ కు పగుళ్లు వస్తున్నాయట . వరల్డ్ టూరిస్ట్ ప్లేస్ గా ఉన్న ఆగ్రాలోని తాజ్ మహల్ లో వర్షపు నీరు లీక్ అవుతుంది అని అదే కాకుండా పగుళ్లు వస్తున్నాయని ..



ప్రధాన గుమ్మటంలో 73 మీటర్ల ఎత్తున నీటిని లీకేజీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా థర్మల్ స్కానింగ్ గుర్తించింది . అంతేకాదు ప్రధాన గుమ్మటం పైన రాళ్ల మధ్యలో ఉండే సున్నం ఇసుకల మిశ్రమం బలహీనపడి పై కప్పు పెచ్చులు మొత్తం ఊడిపోతున్నాయి అని .. తాజ్ మహల్ పైన ఉండే శిఖర ఇనుప చూవ్వ తుప్పు పట్టిన కారణంగా వీక్ అయిపోయింది అని అలాగే పగుళ్లు వస్తున్నాయి అని .. తాజ్ మహల్ ఎప్పుడైనా సరే కూలిపోతుంది  సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి . అయితే కొంతమంది దీనిని సహజ సిద్ధంగా ఇలా జరుగుతుంది అని మాట్లాడుతుంటే .. మరి కొంత మంది మాత్రం ఇది ప్రపంచం వినాశనం అవ్వడానికి  ప్రకృతి ఇస్తున్న హింట్ అని ..ప్రకృతితో పెట్టుకుంటే ఎలాంటి వాళ్ళైనా మాడి మసైపోతారు అని ఘాటుఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు .కొంతమంది తాజ్ మహల్ కి పగుళ్లు వస్తే ప్రపంచం వినాశనం కాబోతుందా ..? ఇదెక్కడి లాజిక్ అంటూ మండిపడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: