వైరల్: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో..భయ్యా సన్నీకి సంబంధమా..?
భయ్యా సన్నీ యాదవ్ తల్లిదండ్రుల విషయానికి వస్తే భయ్యా రవీందర్, అనూష దంపతుల కుమారుడు వీరు సూర్యాపేట జిల్లా ప్రాంతానికి చెందినవారు. చిన్న వయసు నుంచే బైక్ రైడింగ్ అంటే సన్నీకి ఇష్టం ఉండడంతో వాటి ద్వారానే యూట్యూబ్ ని మొదలుపెట్టి దేశంలో వివిధ ప్రాంతాలకు బైక్ రైడింగ్ చేస్తూ పలు రకాల వీడియోలను షేర్ చేసేవారు. 2019లో 21 రోజులపాటు బైక్ పైనే లడక్ యాత్ర కూడా చేశారు. 2019లో నేపాల్ కి వెళ్లిన మొట్టమొదటి విదేశీ యాత్రికుడిగా పేరు సంపాదించారు.ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించిన సన్నీ యాదవ్ మార్చి 5వ తేదీన నూతనకల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఫైల్ అయ్యింది.
కొంతమంది యూట్యూబర్లు పోలీసులను అదుపులోకి తీసుకొని మరి విచారించారు. దీంతో సన్నీ యాదవ్ విదేశాలలో ఉంటున్నట్లుగా గుర్తించడంతో లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే సన్నీ యాదవ్ దుబాయ్ నుంచి పాకిస్తాన్ కి వెళ్లారట.. ఫహల్గం ఉగ్ర దాడి జరిగిన సమయంలో సన్నీ యాదవ్ బైక్ రైడింగ్ తో పాకిస్తాన్లో ఉన్నట్లు తన యూట్యూబ్ లో వీడియోలను అప్లోడ్ చేయడంతో ఈ విషయం బయటపడింది. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు కొంతమంది యూట్యూబర్స్ స్పై ఏజెంట్గా భారత్ రహస్యాలను పాకిస్తాన్ కి చేరవేస్తున్నారంటూ ఎన్ఐ అధికారులు గుర్తించారట. దీంతో కొంతమంది యూట్యూబర్స్ పైన నిఘా పెట్టగా పాకిస్తాన్ నుంచి సన్నీ యాదవ్ రెండు వారాల క్రితం ఇండియాకి చేరారు. అలా పాకిస్తాన్లో పర్యటించిన తన వీడియోలను యూట్యూబ్లో పోస్ట్ చేయడంతో పెద్ద దుమారం రేపింది. యుద్ధం జరుగుతున్నప్పుడు పాకిస్థాన్లోని ఉన్నారట సన్నీ యాదవ్.
ఈ నెల 29న చెన్నైలో సన్నీ యాదవ్ ని అరెస్టు చేశారు.. అంతేకాకుండా ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మలహోత్రాతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారట.. ముఖ్యంగా సన్నీ యాదవ్ మొబైల్, కమ్యూనికేషన్ చరిత్రను కూడా విశ్లేషిస్తున్నట్లు సమాచారం.పాకిస్తాన్ ఏజెంట్గా పని చేసిన యూట్యూబర్ జ్యోతి కి చాలా మందితో స్నేహబంధం ఉందని బయటపడ్డాయి. ఆ కోణంలో సన్నీ యాదవును కూడా విచారిస్తున్నారట. మరి వీటి పైన అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.