రాంగ్ రూట్ లో వచ్చిన మహిళ.. బుద్ధి చెప్పిన కార్ డ్రైవర్.. వీడియో వైరల్?

praveen
దేశంలో ప్రతియేటా కొన్ని వేలమంది ప్రతి రోజు రోడ్డు ప్రమాదాలకు గురై మరణిస్తున్నారు. ఇక ఇలా ప్రమాదాలకు గురవ్వడానికి కారణం వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ ట్రాఫిక్ నిబంధనలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇక్కడ ఎవరి కంగారు వారిది. వాహనదారులు ట్రాఫిక్ లో ఓ రెండు నిముషాలు వెయిట్ చేయడానికి కూడా ఓపిక పట్టరు. చాలామంది రూల్స్ కి విరుద్ధంగా డ్రైవింగ్ చేస్తూ వారి ప్రాణాలమీదకు మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలు కూడా పోవడానికి కారకులు అవుతారు. ప్రస్తుతం ఆ రకానికి సంబందించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఒక మహిళ తన స్కూటర్‌తో రాంగ్ రూట్‌లో ప్రయాణించడం మనం గమనించవచ్చు. పైగా ఆమె హెల్మెట్ కూడా ఇక్కడ ధరించక పోవడం కొసమెరుపు. ఇది కర్ణాటక రాష్ట్రంలో జరిగినట్టు తెలుస్తోంది. యాక్టివా స్కూటర్‌ను నడుపుతున్న మహిళ రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేస్తుంది. అది రెండు లైన్ల రోడ్డు కావడం వలన రోడ్డు చాలా వాహనాలతో నిండిపోయింది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వలన వాహనాలు ఒకదాని వెనుక మరోటి చాలా స్లోగా వెళ్తున్నాయి. యాక్టివాను నడుపుతున్న మహిళ వాహనాలకు ఎదురుగా వస్తున్నారు. ఆ సమయంలో ఒక కారుకు ఆమె అడ్డంగా వచ్చారు. కాగా కారు ముందుకు వెళ్లడానికి ఎలాంటి దారి లేదు. స్కూటర్‌కు వెళ్లడానికి దారి లేకపోవడంతో రెండు వాహనాలు కూడా కాసేపు అలాగే ఉండిపోయాయి.

ఇక అదే సమయంలో యాక్టివాను నడుపుతున్న మహిళ కారును ప్రక్క లైన్ నుంచి రమ్మని కోరింది. కానీ కారు డ్రైవర్, నేను ఎమన్నా రాంగ్ రూట్లో వస్తున్నానా? మీరే రాంగ్ రూట్‌లో వస్తున్నారు అంటూ ప్రక్కనుంచి వెళ్లండి అన్నట్లుగా కారును అలాగే కాసేపు నిలిపి ఉంచాడు. ఈ మొత్తం తతంగం కారు డాష్‌బోర్డులో ఉన్నటువంటి కెమెరాలో రికార్డు కావడం గమనార్హం. స్కూటర్ నడుపుతున్న మహిళ తన రక్షణ కోసం ఉపయోగపడే హెల్మెట్ లేకుండా, రాంగ్ రూట్‌లో ప్రమాదకరమైన డ్రైవింగ్ చేయడం ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించడమే కాకుండా కారు నడిపే వ్యక్తిని ఆజ్ఞాపించడం ఇంకా అతి చేసినట్టు అనిపిస్తోంది. అయినప్పటికీ ఆ మహిళ మొహంలో ఎక్కడ తప్పు చేసినట్లుగా పశ్చాతాపం కనిపించడం లేదు. ఇక ఆఖరికి ఆ మహిళకి బుద్ది చెప్పాలనుకున్న సదరు కారు డ్రైవర్ తన కారుని స్కూటర్‌కు అడ్డుగా కాసేపు అలా ఉంచడంతో ఆమె కొన్ని క్షణాల పాటు అక్కడే వేచి ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అయితే కారును, కాసేపటి తరువాత కొంచెం ప్రక్కకు తీయడంతో చిన్న గ్యాప్‌లో నుంచి మహిళ వెళ్లిపోయింది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోని జనాలు ఎక్కువగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆ మహిళ రూల్స్ ని అతిక్రమించడమే కాకుండా కారు డ్రైవర్ ని ఇబ్బందిపెట్టిందని కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: