బైక్ పెట్రోల్ ట్యాంక్ లో టపాసు పెట్టి పేల్చాడు.. చివరికి ఏమైందో చూడండి?

praveen
దీపావళి అంటే చెడుపై మంచి సాధించిన విజయం.. దీపావళి అంటే దీపాల వెలుగులతో ఇక ప్రతి మనిషి జీవితంలో ఉన్న చీకటిని పారదోలడం.. దీపావళి అంటే కుటుంబమంతా ఒక్కచోట చేరి జరుపుకునే ఒక గొప్ప పండుగ.. దీపావళి అంటే మన సంస్కృతి సాంప్రదాయాన్ని మరోసారి గుర్తు చేసుకోవడం.. ఇదంతా ఒకప్పుడు జరుపుకున్న పండుగ. కానీ నేటి రోజుల్లో దీపావళి అంటే రాక్షసానందాన్ని పొందడం.. మరోవైపు ఏకంగా ప్రాణాలను పోగొట్టుకునే విన్యాసాలు చేయడం. ఇదే ఇప్పుడు దీపావళి పండుగ వచ్చింది అంటే కనిపిస్తుంది.  

 దీపావళి పండుగ వచ్చింది అంటే చాలు చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ టపాసులు కాలుస్తూ ప్రతి ఒక్కరూ సంబరాల్లో మునిగిపోతూ ఉంటారు. అయితే నేటి రోజుల్లో కొంతమంది యువకులు మాత్రం దీపావళికి సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలని ఉద్దేశంతో చేస్తున్న పిచ్చి పనులు అందరిని ఆగ్రహానికి గురి చేస్తూ ఉన్నాయి. కొంతమంది ఇతరులను, మూగజీవాలను ఇబ్బందులకు గురి చేస్తూ రాక్షసానందం పొందుతుంటే ఇంకొంతమంది ప్రమాదం అని తెలిసినప్పటికీ.. కొన్ని పిచ్చి పనులు చేస్తూ చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే.

 సాధారణంగా ప్రతి ఒక్కరు ఇంటి వాకిట్లోనో లేదంటే పెరట్లోనో ఇలా దీపావళి రోజు టపాసులు కాల్చడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యువకుడు అందరిలా కాలిస్తే కిక్ ఏముంది అనుకున్నాడో ఏమో.. చివరికి ప్రాణాలు పోయేంత ప్రమాదకరమైన విన్యాసం చేయడానికి సిద్ధమయ్యాడు. ఏకంగా ఒక బైక్ పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేసి అందులో టపాసు పెట్టి పేల్చాడు. దీంతో ఒక్కసారిగా ఆ బైక్ బ్లాస్ట్ అయిపోయింది. పెట్రోల్ ట్యాంక్ పూర్తిగా ఊడి గాల్లో ఎగిరి పడింది. అయితే ఇదంతా అతను పొలాల్లో చేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోవడంతో.. ఇలాంటి పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం అవసరమా అంటూ నేటిజన్స్ తిట్టిపోస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: