ఉచితంగా ఇంటర్నెట్: ముఖేష్ అంబానీ తో ఎలాన్ మాస్క్ పోటి..!
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా ఎలన్ మాస్క్ కలిసి వచ్చేలా ఉన్నదట. ఇండియాలో కూడా సాటిలైట్ స్ప్రెక్టమ్ సేవలను సైతం ప్రారంభించడానికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పలు రకాల చర్యలు తీసుకుంటుందట. వీటికి సంబంధించి అన్ని విషయాలలో కూడా ఎలన్ మాస్క్ ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియాలో టెలికాం రంగం పరంగా అగ్రగామిగా పొందిన రిలయన్స్ జియో ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతోందట. ఎప్పటినుంచో దేశవ్యాప్తంగా కాల్స్ ఇంటర్నెట్ వంటి సేవలను సైతం అందిస్తున్నప్పటికీ తమకు ఇలాంటి కాంట్రాక్టు ఇవ్వకుండా ఉండడంతో అంబానీ ఫైర్ అవుతున్నారట.
కేంద్ర ప్రభుత్వం ఈ శాటిలైట్స్ స్పెక్ట్రమ్ ను ITU (ఇంటర్నేషనల్ టెలి కమ్యూనికేషన్ యూనియన్) కు ఇచ్చేలా ప్లాన్ చేసిందట. ఇది చాలా దేశాలతో టైయ్యప్ అయ్యి ఉంటాయని ఇండియాలో కూడా వీటితో చేయిస్తే మంచి అనుబంధం ఉంటుందనే విధంగా చూస్తోందట. అయితే ఎలాన్ మాస్క్ కు ITU తో మంచి అనుబంధం ఉన్నది. అలాగే అడ్మిన్స్ట్రేటివ్ మెథడ్ ద్వారా ఎలాన్ మాస్క్ ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను సైతం చేయడానికి కాంట్రాక్టు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పైన అంబానీ కాస్త కోపంగానే ఉన్నారట. ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం స్పెక్ట్రమ్ ఎలకేషన్స్ కేవలం వేలంపాట విధానాన్ని మాత్రమే ఫాలో అవుతుందట. ఈ పద్ధతి ఎన్నో ఏళ్లుగా వస్తోందట. అయితే ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ కండిషన్స్ కు ఓకే చెబితేనే కంపెనీలకు ప్రభుత్వం సైతం లైసెన్స్ ఇస్తుందట. అయితే ఇందులో చాలామంది అంబానీని వ్యతిరేకిస్తూ ఉండడంతో ఈసారి ఎలాంటి మాస్క్ కు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు కేవలం జియో నగరాలలో పల్లెలలో తప్ప కొండ ప్రాంతాలలో పనిచేయడం లేదు.. ఈ టెలికాం సేవలు వస్తే శాటిలైట్ ద్వారా ఉపరితలం పైన ఎక్కడైనా సరే వీటి సేవలు ఉపయోగించుకోవచ్చు. సుమారుగా 100 దేశాలలో 6,419 ఉపగ్రహాల ద్వారా ఈ ఇంటర్నెట్ సేవలను అందించబోతున్నారట.