మహాభారతం: అభిమన్యుడి చావుని శ్రీకృష్ణుడు ఎందుకు ఆపలేకపోయాడు..?

Divya
మహాభారతంలో ఎక్కువగా వినిపించే పేర్లు అర్జునుడు, కృష్ణుడు , కర్ణుడు, దుర్యోధనుడు, కుంతీమాత, ద్రౌపది ఇతర పేర్లు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అయితే అర్జునుడు కృష్ణుడికి బంధుత్వం కూడా ఉన్నది ముఖ్యంగా శ్రీకృష్ణుడు చెల్లెలు సుభద్రాన్ని అర్జునుడు వివాహం చేసుకుంటారు. అలా అర్జునుడుకు సుభద్రా కు అభిమన్యుడు జన్మిస్తారు. ఇక అభిమానుడు మహాభారత యుద్ధంలో పద్మ వ్యూహంలో ప్రవేశించడంతో బయటికి రాలేక మరణిస్తారు. అయితే ఈ మరణాన్ని కూడా కృష్ణుడు ఎందుకు ఆపలేకపోయారు అనే విషయం చాలా మందికి సందేహం గానే ఉంటుంది వాటి గురించి చూద్దాం.

అభిమన్యుడు జన్మించక ముందే సుభద్ర కడుపులో పద్మ వ్యూహాన్ని చేదించగలిగే జ్ఞానాన్ని సైతం పొందుతారట. కానీ అందులో నుంచి బయటపడే విషయాన్ని మాత్రం తెలుసుకోకనే పుట్టేస్తారు.. కేవలం 16 సంవత్సరాల వయసులోనే అభిమన్యుడు అమరవీరుడు అవుతారు. ఆభిమన్యుడు మరణించే సమయంలో కూడా యుద్ధ భూమిలో శ్రీకృష్ణుడు ఉంటారు.తనకు ఇష్టమైన మేనల్లుడుని రక్షించ లేకపోవడం వెనుక కూడా ఒక కారణం ఉందట.. దేవుళ్ళు సైతం శ్రీకృష్ణుడు  చేపట్టిన ధర్మ రక్షణ కోసం భూమి పైన అవతరించాలనుకుంటారట.

అలా ఏదో ఒక రూపంలో భూమి పైకి భగవంతుడు రావాలని ఈ దృశ్యాన్ని చూడాలని చాలామంది దేవుళ్ళు  మానవుని రూపంలో భూమిపైన జన్మించారట. మరి కొంతమంది మాత్రం తమకు బదులుగా తమ కూతుర్లను భూమికి పంపించారట అలా సూర్యుని కుమారుడు కర్ణుడు.. చంద్రుని కుమారుడు వచ్చా, ఇంద్రుని కుమారుడు అర్జునుడిగా జన్మిస్తారట. కానీ చంద్రుని కుమారుడు చంద్రునికి అంటే చాలా ఇష్టం.. తనని వదిలిపెట్టి ఉండలేక పోతూ ఉంటారట.. దీంతో దేవతలందరూ కూడా చంద్రుడు తన కుమారుడని భూమి మీదికి పంపించే వరాన్ని ఇవ్వాలి అంటూ కోరారు కానీ అక్కడ ఒక కండిషన్ పెట్టి 16 సంవత్సరాలు మాత్రమే భూమిపైన నివసించేలా వరం ఇస్తారట.. అలా చంద్రుడు కుమారుడు రూపం అర్జునుడు కుమారుడు అభిమన్యుడుగా పుడతారట. అందుకే 16 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ చంద్రుడు కుమారుడు చంద్రుని వద్దకు పంపిస్తామని కూడా శ్రీకృష్ణుడు చంద్రుడికి మాట ఇస్తారట.. అందుకే 16 సంవత్సరాల వయసులోని అభిమానులు అమరవీరుడయ్యారని పురాణాలు సైతం తెలియజేస్తూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: